Surekha Vani : అరేయ్ ఏంట్రా ఇది.. ఇంకా నమ్మలేకపోతోన్నా.. సురేఖా వాణి ఎమోషనల్
Surekha Vani : హోళీ పండుగ నాడు నటి గాయత్రి మరణించిన సంగతి తెలిసిందే. జూనియర్ ఆర్టిస్ట్, షార్ట్ ఫిల్మ్స్ నటి గాయత్రి కారు ప్రమాదంలో మరణించిన విషయం ఎంతటి హాట్ టాపిక్‌గా మారిందో అందరికీ తెలిసిందే. గాయత్రితో పాటు ఆమె స్నేహితుడు సైతం మరణించాడు. మద్యం తాగి కారుని నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
హోళీ నాడు మద్యం నిషేదించినా కూడా కొబ్బరి బొండాంలో మద్యాన్ని నింపుకుని తాగి మరీ కారుని నడిపారు. గచ్చిబౌలిలో జరిగిన ఈ ప్రమాదంలో గాయత్రి మరణించింది. దీంతో గాయత్రి మరణ వార్త తెలుసుకుని సురేఖా వాణి, సుప్రిత, ఆనీ మాస్టర్, ఆర్జే కాజల్ వంటి వారు తీవ్ర సంతాపాన్ని వ్యక్తంచేశారు. ఇక సుప్రిత, సురేఖా వాణి అయితే రోజుకో పోస్ట్ పెడుతూ ఎమోషనల్ అవుతున్నారు.

Surekha vani Mourns For Junior Artist Gayathri Death
Surekha Vani : హృదయం బద్దలైనట్టుగా..
నిన్న గాయత్రి సంస్మరణ సభ పెట్టినట్టున్నారు. ఈ పెద్దకర్మకు సురేఖా వాణి, సుప్రిత కూడా వెళ్లినట్టున్నారు. ఇక చనిపోయిన గాయత్రిని తలుచుకుంటూ సురేఖా వాణి, సుప్రిత కన్నీరు పెట్టుకున్నారు. ఏంట్రా ఇది.. నువ్ లేవంటే.. ఇంకా నమ్మలేకపోతోన్నాను అంటూ హార్ట్ బ్రేక్ అయిన ఎమోజీని సురేఖా వాణి షేర్ చేసింది. మొత్తానికి గాయత్రి మాత్రం సురేఖా వాణి ఇంట్లోనే ఉంటూ పార్టీలు అని సందడి చేసేది.