Taapsee : ఈ ఏజ్‌లో ఇలాంటి రిస్క్ అవసరమా తాప్సీ ..?

Advertisement

Taapsee : సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైన తాప్సీ ఇక్కడ పెద్ద హీరోలతోనే సినిమాలు చేసి ఆకట్టుకుంది. కానీ, ఇక్కడ తాప్సీ ఖాతాలో చేరిన హిట్స్ మాత్రం చాలా తక్కువ అని చెప్పాలి. గట్టిగా మూడు బ్లాక్ బస్టర్స్ కూడా తన ఖాతాలో చేరకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. దాంతో తెలుగులో తాప్సీని పక్కనపెట్టారు. ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ తనకి అవకాశాలు ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ రోల్స్, బికినీ ట్రీట్ ఇచ్చిన తాప్సీ మెల్ల మెల్లగా కథా బలమున్న పాత్రలవైపు మొగ్గు చూపుతూ వచ్చింది. ఫైనల్‌గా ఆమె కోసమే ఇప్పుడు కథలు సిద్ధమవుతున్నాయి.

అంటే తాప్సీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్‌కి చేరుకుందో అర్థమవుతుంది. బాలీవుడ్ మెగాస్టార్ తో స్క్రీన్ పంచుకునే అవకాశం ఎవరికైనా ఒక్కసారే వస్తుంది. అది కూడా చాలా కష్టం. అలాంటిది తాప్సీకి మాత్రం రెండు సినిమాలలో నటించే అవకాశం దక్కింది. చెప్పాలంటే ఆమెకి ఈ సినిమాలే బాగా హిందీ సీమలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. అప్పటి నుంచే సినిమాల ఎంపికలో తన పంథా మొత్తం మారింది. ఇదే సమయంలో తాప్సీకి బయోపిక్స్ చేసే అవకాశాలు దక్కుతున్నాయి. ఇప్పుడు నటించిన శభాష్ మిథు రిలీజ్ కి రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు.

Advertisement
Taapsee be seen how successful Ammadu will be as a producer
Taapsee be seen how successful will be as a producer

Taapsee : అదే ఇప్పుడు తాప్సీకి కొందరు సూచిస్తున్నారట.

ఇందులో భాగంగా తాప్సీ, స్టార్ హీరోయిన్ సమంతతో తన సొంత నిర్మాణ సంస్థలో సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే బ్లర్ అనే సినిమాను నిర్మిస్తూ ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఇక సమంత చేయబోయో సినిమా కూడా బడ్జెట్ సినిమానే అంటున్నారు. అయితే, చాలా మంది హీరోయిన్స్ నిర్మాతగ మారి చేతులు కాల్చుకున్నారు. హీరోయిన్ గా మంచి ఫాంలో ఉండగానే సొంతగా ప్రొడక్షన్స్ కంపెనీ స్టార్ట్ చేసి సినిమాలు నిర్మించి అవి ఫ్లాపవడంతో అటు హీరోయిన్, ఇటు నిర్మాతగా కెరీర్ దెబ్బ తింటుంది. అదే ఇప్పుడు తాప్సీకి కొందరు సూచిస్తున్నారట. మరి నిర్మాతగా అమ్మడు ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఇంత చిన్న ఏజ్‌లో నిర్మాణ రంగం వైపు రావడం కూడా ఆమె చేస్తున్న రిస్క్ అంటున్నారు.

Advertisement
Advertisement