Taapsee : ఏంజెల్‌లా మెరిసిన తాప్సీ.. ఆ యాంగిల్స్ ఏంద‌మ్మ‌డు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Taapsee : ఏంజెల్‌లా మెరిసిన తాప్సీ.. ఆ యాంగిల్స్ ఏంద‌మ్మ‌డు..!

 Authored By sandeep | The Telugu News | Updated on :7 July 2022,8:30 pm

Taapsee : సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యం ఈ ముద్దుగుమ్మ సొంతం. ప‌దేళ్ల కింద వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మ‌మైన తాప్సీ పన్ను.. ఆ తర్వాత హిందీ, తమిళంలో కూడా అవకాశాలు అందుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుంది తాప్సీ. ఇప్పుడు హిందీ తప్ప మిగిలిన భాషలపై పెద్దగా ఫోకస్ చేయడం లేదు ఈ బ్యూటీ. చాలా రోజుల నుంచి ఈమె ప్రేమలో ఉందనే విషయం తెలుసు.

కాకపోతే ఎవరు అనేది మాత్రం చెప్పలేదు తాప్సీ. తను ప్రేమలో ఉన్నాను..  కానీ ఇండస్ట్రీ మనిషి కాదని మాత్రం ఇదివరకే చెప్పుకొచ్చింది ఈమె. రీసెంట్‌గా బయటపెట్టింది తాప్సీ. ఆ మధ్య తన ప్రియుడితో కలిసి మాల్దీవులకు కూడా వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేసింది. అయితే తాప్సీ న‌టిగానే కాకుండా నిర్మాత‌గా కూడా రాణిస్తుంది. ప్రస్తుతానికి తాప్సీ బ్యానర్ లో సమంత నటించే చిత్రానికి సంబంధించి స్టోరీ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాలో తాను కూడా ఓ కీలకమైన పాత్రలో నటించేందుకు సిద్ధం అంటోంది తాప్సీ. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తానంటోంది.

taapsee beautiful looks are stunning

taapsee beautiful looks are stunning

Taapsee : తాప్సీ అందాల ఆర‌బోత‌..

సౌత్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ స్టార్ డమ్ అందుకుంది తాప్సీ. ప్రస్తుతం రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో షారుఖ్ హీరోగా తెరకెక్కుతున్న డంకీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు తాప్సీ దారిలోనే సమంత కూడా బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర కోసం ప్రయత్నిస్తోంది. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే తాప్సీ కొద్ది రోజులుగా ఫొటో షూట్స్‌తో పిచ్చెక్కిస్తుంది. తాజాగా అందాల ముద్దుగుమ్మ వైట్ డ్రెస్‌లో కేక పెట్టించే అందాల‌తో కైపెక్కించింది. ఈ అమ్మ‌డు క్యూట్ లుక్స్ తో పాటు యాంగిల్స్ చూస్తుంటే కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ప్ర‌స్తుతం బ్యూటీ లుక్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది