Tamannah Bhatia : డబ్బింగ్ చెప్పేందుకు కష్టపడ్డ మిల్కీ బ్యూటీ!.. వంటల ప్రోగ్రాంలో తమన్నా
Tamannah Bhatia మిల్కీ బ్యూటీ తమన్నా Tamannah Bhatia కు తెలుగు మాట్లాడటం బాగానే వచ్చు. స్టేజ్ ఎక్కితే తెలుగులో ప్రసంగం బాగానే ఇస్తుంది. కానీ ఎక్కువగా టెన్షన్ పడుుతన్నట్టు అనిపిస్తుంది. అలా తమన్నా Tamannah Bhatia తన తెలుగు ప్రావీణ్యాన్ని సందర్భంగా వచ్చినప్పుడల్లా చూపిస్తుంటుంది. అయితే ఇలా తెలుగు భాషను నేర్చుకోవడం మంచి విషయమే. తెలుగు మీద అభిమానం, ఇక్కడి ప్రేక్షకుల మీద ప్రేమ, కెరీర్ ఇక్కడే బిల్డప్ అవుతుండటంతో భాషను నేర్చుకుని ఉండొచ్చు.
Tamannah Bhatia Dubbing For Telugu Master Chef Programme
వంటల ప్రోగ్రాంలో తమన్నా Tamannah Bhatia
అలాంటి తమన్నా Tamannah Bhatia ఇప్పుడు ఏకంగా తెలుగులో ఓ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతోంది. ఈ క్రమంలోనే వంటల ప్రోగ్రాంకు వ్యాఖ్యాతగా మారనుంది. మాస్టర్ చెఫ్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన ఈ షోను తెలుగులోకి తీసుకువస్తున్నారు. తమిళంలో ఇదే షోను విజయ్ సేతుపతి నడిపేందుకు రెడీ అయ్యాడు. తెలుగులో మన తమన్నా ఈ షోను నడిపించనుంది. తాజాగా వదిలిన ఓ ప్రోమో బాగానే వైరల్ అవుతోంది. కానీ ఇందులో తమన్నా డబ్బింగ్ చెప్పేందుకు కష్టాలు పడ్డట్టు కనిపిస్తోంది.
Tamannah Bhatia Dubbing For Telugu Master Chef Programme
‘తెలుగు భాషలో ఓ గొప్పదనం ఉంటుంది.. తెలుగు వంటల్లో ఓ కమ్మదనం ఉంటుంది. నేను పుట్టింది ఎక్కడైనా కావచ్చు. ప్రేమ, అభిమానాలు సొంతం చేసుకున్నది మాత్రం తెలుగు ఇండస్ట్రీలోనే. నన్ను ఇంతగా పాపులర్ చేసింది మీరే. తెలుగు సినిమా నా జీవితంలో ఎలా భాగమైందో. తెలుగు వంటలు కూడా భాగమయ్యాయి. రాయలసీమ రుచులు, కోస్తా పులుసు, తెలంగాణ దావత్‌లు ఎక్కడికి వెళ్లినా మరిచిపోలేను. అలాంటి వంటలను మన తెలుగు వారందరితో కలిసి ప్రపంచం అంతటా సెలెబ్రేట్ చేసుకునేందుకు సరైన వేదిక’ అంటూ మాస్టర్ చెఫ్ ప్రోగ్రాం గురించి చెప్పుకొచ్చింది. త్వరలోనే ఈ ప్రోగ్రాం జెమినీ టీవీలో రాబోతోందట. అయితే తమన్నా మాత్రం ఈ డైలాగ్‌లను బట్టి పట్టి మరి అప్పజెప్పినట్టు కనిపిస్తోంది.
View this post on Instagram
ఇది కూడా చదవండి ==> ఆ ఒక్క మాట చాలు.. బాలయ్యపై యాంకర్ ప్రదీప్ కామెంట్స్
ఇది కూడా చదవండి ==> అత్తింట్లో గొడవలు.. నిహారిక భర్తపై పోలీసులకు ఫిర్యాదు.. అసలు ఏం జరిగింది…?
ఇది కూడా చదవండి ==> జాన్వీ కపూర్ పెళ్ళి ఎక్కడో ఫిక్సైపోయింది..పెళ్ళి కబురు చెబుతున్న శ్రీదేవి కూతురు..!
ఇది కూడా చదవండి ==> జబర్దస్త్ టీం కి షాకిచ్చిన మల్లెమాల.. రెమ్యునరేషన్ కట్.. ఎందుకంటే..?