Tammannah : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా అదే టైప్.. తమన్నా సంచలన వ్యాఖ్యలు వైరల్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tammannah : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా అదే టైప్.. తమన్నా సంచలన వ్యాఖ్యలు వైరల్

Tammannah : టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందరో నటులకు లైఫ్ ఇచ్చింది. ఎందరికో స్టార్ డమ్ ఇచ్చింది. ఆ స్టార్ డమ్ తో వేరే ఇండస్ట్రీలను ఏలిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకరు తమన్నా. ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారానే పాపులారిటీ పొందింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ లో తన సత్తా చాటింది. బాలీవుడ్ లోనూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా సెటిల్ […]

 Authored By kranthi | The Telugu News | Updated on :1 October 2023,5:00 pm

Tammannah : టాలీవుడ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎందరో నటులకు లైఫ్ ఇచ్చింది. ఎందరికో స్టార్ డమ్ ఇచ్చింది. ఆ స్టార్ డమ్ తో వేరే ఇండస్ట్రీలను ఏలిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లలో ఒకరు తమన్నా. ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీ ద్వారానే పాపులారిటీ పొందింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్ లో తన సత్తా చాటింది. బాలీవుడ్ లోనూ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా సెటిల్ అయింది. తెలుగు ఇండస్ట్రీల లైఫ్ ఇస్తేనే తమన్నా ఇప్పుడు ఒక స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. కానీ.. కన్నతల్లి లాంటి టాలీవుడ్ ఇండస్ట్రీపై తాజాగా తమన్నా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ మధ్య సౌత్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ వస్తున్నా వాటిని తిరస్కరిస్తున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది తమన్నా. దానికి కారణం ఏంటంటూ అడగగా.. అక్కడ పురుషాధిపత్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మహిళలను తొక్కేస్తారు.. అంటూ ఏవేవో వ్యాఖ్యలు చేసింది తమన్నా. అంటే.. ఇన్ డైరెక్ట్ గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా అదే టైప్ అన్నట్టుగా తమన్నా వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే లేపింది. ఎందుకంటే.. ఇన్నేళ్లు సౌత్ ఇండస్ట్రీలో పని చేసి.. నాలుగు రాళ్లు వెనుకేసుకొని.. స్టార్ హీరోయిన్ గా ఎదిగి ఇప్పుడు బాలీవుడ్ లో ఏదో రెండు మూడు ఆఫర్స్ రాగానే టాలీవుడ్ చేదు అయిపోయిందా అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

tamanna shocking comments on tollywood heroes

#image_title

Tammannah : తమన్నా ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసింది?

నిజానికి తమన్నా తెలుగు తమిళం రెండు భాషల్లో స్టార్ హీరోల సరసన నటించింది. రాజమౌళి దర్శకత్వంలోనూ నటించింది. బెస్ట్ సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకుంది. మరి.. అలాంటి తమన్నాకు సౌత్ ఇండస్ట్రీలో ఏం చేదు అనుభవం ఎదురైందో తెలియదు కానీ.. తను చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే పెద్ద దుమారం లేపాయి. చూద్దాం మరి తమన్నా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటుందా? లేక తన మాటల మీద కట్టుబడి ఉంటుందా?

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది