Vadivelu : తమిళ కమెడియన్ వడివేలుకు అస్వస్థత.. కరోనాతో ఆస్పత్రిలో చేరిక..!
Vadivelu : ప్రముఖ తమిళ నటుడు, స్టార్ కమెడియన్ వడివేలు కొవిడ్ బారిన పడ్డారు. స్వల్ప అస్వస్థతకు గురైన వడివేలుకు వైద్య పరీక్షలు నిర్వహించగా ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆయనను వెంటనే చెన్నైలోని రామచంద్రా ఆసుపత్రిలో చేర్పించారు.
ప్రస్తుతం వడివేలు.. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ హోమ్ క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.నాయి శేఖర్ రిటర్న్స్ అనే తమిళ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లి వచ్చిన తర్వాత వడివేలు అస్వస్థతకు గురయ్యారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో ఆయన ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించారు.

Tamil comedian Vadivelu joins hospital with vivid infection
ఇటీవల నటుడు కమలహాసన్ కూడా కోవిడ్ బారిన పడి ఇదే రామచంద్రా ఆసుపత్రిలో జాయిన్ ఈ మధ్యే కోలుకున్నారు.తమిళ ఇండస్ట్రీకి చెందిన హాస్యనటుడు వడివేలు.. 1990 నుండి తమిళ చిత్రాలతో పాటు ఇతర భాషల్లో హాస్యనటుడిగా కొనసాగుతున్నారు. వడివేలు పలు భాషల్లో ఇప్పటివరకు 200 చిత్రాలలో నటించాడు.