Tanikella Bharani : ఆ హీరో వల్లే 18 సినిమాలు కోల్పోయాను అని షాకింగ్ కామెంట్స్ చేసిన తణికెళ్ల భరణి..!
ప్రధానాంశాలు:
Tanikella Bharani : ఆ హీరో వల్లే 18 సినిమాలు కోల్పోయాను అని షాకింగ్ కామెంట్స్ చేసిన తణికెళ్ల భరణి..!
Tanikella Bharani : నటుడిగా, రచయితగా, దర్శకుడిగా తణికెళ్ల భరణి తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. 40 ఏళ్లుగా దాదాపు 800 కు పైగా సినిమాలో నటించిన ఆయన ఇప్పటికీ సినిమాలలో నటిస్తూ ఉన్నారు. అయితే తాజాగా తణికెళ్ల భరణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇప్పటిదాకా నేను ఎనిమిది వందలకు పైగా సినిమాలలో నటించాను. అందులో 300 సినిమాలలో తండ్రి పాత్రలే చేశానని అన్నారు. ఇటీవల అన్ని రొటీన్ పాత్రలే వస్తున్నాయని ప్రతి సినిమాలో హీరో లేదా హీరోయిన్ తండ్రి పాత్రలు చేయమని డైరెక్టర్లు అడుగుతున్నారని అటువంటి పాత్రలు చేసి బోర్ కొట్టిందని, అందుకే తండ్రి పాత్రలు వచ్చిన 18 సినిమాలను వదులుకున్నానని తణికెళ్ల భరణి అన్నారు. ప్రస్తుతం 10 సినిమాలలో నటిస్తున్నానని ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్ర చేస్తున్నానని, విలన్ గా కూడా నటిస్తున్నానని అలాంటి పాత్రలు చేయడమే ఇష్టం అని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.
నాటకాలు వేసుకుంటున్న సమయంలో ఆత్రేయ తన సినిమాలకు పాటలు రాయమని 400 జేబులో పెట్టారని ఆ సమయంలో నేను చాలా సంతోషపడ్డారని తనికెళ్ల భరణి అన్నారు. ఇక ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో అందరితో కలిసి నటించానని నందమూరి ఫ్యామిలీలో కూడా అందరితో కలిసి నటించానని, కానీ ఒక్క అన్నగారితోనే నటించలేదని అన్నారు. పెదకాపు సినిమాలో తణికెళ్ల భరణి వైవిధ్యమైన పాత్ర పోషించారు. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీ వాస్తవ జంటగా మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
ఇక ఇటీవల సర్కార్ నౌకరి సినిమాలో కూడా తనికెళ్ల భరణి నటించారు. ఈ సినిమా థియేటర్స్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మిథునం’ తర్వాత నా దర్శకత్వంలో మరో సినిమా రాలేదని. నేను కమర్షియల్ సినిమాలు తీయలేనని, నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయని, ఆర్ట్ ఫిల్మ్ తరహా చిత్రాలను నిర్మించే నిర్మాతలు దొరకడం లేదని, నా నలభై ఏళ్ల కెరీర్‌లో నేను అనుకున్నవన్నీ చేశానని, అయితే ఓ అంతర్జాతీయ సినిమా తీయాలనే ఆకాంక్ష మాత్రం మిగిలిపోయి ఉంది అని అన్నారు. ప్రస్తుతం శివరాజ్‌కుమార్, ప్రభుదేవా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాను అని అన్నారు. శేఖర్ అనే కొత్త దర్శకుడు తీస్తున్న సినిమాలో ఓ వైవిధ్యమైన పాత్ర చేస్తున్నాను అని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.