Taraka Ratna : తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Taraka Ratna : ఎంత పెద్ద హీరోని అడిగినా కూడా మీ యొక్క మొదటి పారితోషికం ఎంత అంటే చెప్పుకోలేనంత అని.. చెప్పుకుంటే సిగ్గు పోయేంత అంటూ ముసి ముసిగా నవ్వుతూ సమాధానం చెప్తారు. ప్రస్తుతం రూ. 100 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలు కూడా కెరియర్ ఆరంభంలో ఐదు లక్షలు నుండి పది లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక చిరంజీవి జనరేషన్ హీరోలైతే 5000 నుండి 10,000 రూపాయల రెమ్యూనరేషన్ తో కూడా సినిమాల్లో నటించారు అంటూ అప్పట్లో ప్రచారం జరిగేది.
ఇటీవల మృతి చెందిన నందమూరి తారకరత్న దాదాపు 20 సంవత్సరాల క్రితం ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఆ సినిమాను వైజయంతి మూవీస్ లో అశ్విని దత్ నిర్మించాడు. ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో అశ్వినిదత్ మాట్లాడుతూ ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్నను పరిచయం చేయాల్సి వచ్చిన సమయంలో బడ్జెట్ గురించి చాలా ఆలోచించాను. కాస్త ఎక్కువగానే ఖర్చు పెట్టాలి అనుకున్నాం. అందుకే హీరో తారకరత్న రెమ్యూనరేషన్ తగ్గించాలని అనుకున్నాము. అందుకు తారకరత్న కూడా ఓకే చెప్పాడని, కేవలం అన్ని ఖర్చులతో కలిపి పది లక్షల రూపాయల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నారని ఆయన పేర్కొన్నాడు.
తారకరత్న రెమ్యూనరేషన్ పై దృష్టి పెట్టకుండా మంచి కథలు చేయాలని మంచి సినిమాల్లో నటించాలని కోరుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఒకేసారి 9 సినిమాలను ప్రారంభించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ ని సొంతం చేసుకున్న తారకరత్న అన్ని సినిమాలకు కూడా అడ్వాన్సులు తీసుకున్నాడు. కానీ కొన్ని సినిమాలను పూర్తి చేశాడు, మరికొన్ని సినిమాల యొక్క నిర్మాతలకు అడ్వాన్సులు తిరిగి ఇచ్చాడు. మొత్తానికి తారకరత్న మొదటి సినిమాకు చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి కాస్త గౌరవప్రదమైన రెమ్యూనరేషన్ ను తారకరత్న అందుకున్నాడు.