Game Changer : గేమ్ చేంజర్ 5 గంటలు రన్ టైమ్.. శంకర్ ఎందుకు అలా చేశాడు..!
ప్రధానాంశాలు:
Game Changer : గేమ్ చేంజర్ 5 గంటలు రన్ టైమ్.. శంకర్ ఎందుకు అలా చేశాడు..!
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబోలో వచ్చిన గేమ్ చేంజర్ Game Changer సినిమా ప్రేక్షకుల నుంచి మిక్సెడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. అసలైతే ఈ సినిమా మీద ఉన్న అంచనాలకు బ్లాక్ బస్టర్ కొడుతుందేమో అనుకున్నారు. ఐతే శంకర్ తన ఓల్డ్ స్కూల్ ఆఫ్ టేకింగ్ తో తెర మీద భారీతనం ఉన్నా దాన్ని ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోవడం వల్ల సినిమా మిస్ ఫైర్ అయ్యింది.ఐతే సినిమా విషయంలో మేకర్స్ ఎంత భారీ ప్లాన్ వేసినా వర్క్ అవుట్ కాలేదు. శంకర్ సినిమా లో ఉండాల్సిన విజువల్ గ్రాండియర్.. భారీతనం ఉన్నా ఎందుకో సినిమా వర్క్ అవుట్ అవ్వలేదు. ఐతే శంకర్ ఆఫ్టర్ గేమ్ చేంజర్ రిలీజ్ సినిమాను తాను అనుకున్నట్టుగా తీయలేకపోయానని అన్నాడు. తాను అనుకున్నట్టుగా తీస్తే సినిమా 5 గంటల దాకా వస్తుందని.
Game Changer : శంకర్ ఏం చేశాడంటూ ఫ్యాన్స్..
చాలా సీన్స్ ట్రిం చేయాల్సి వచ్చిందని ఆడియన్స్ కు షాక్ ఇచ్చారు శంకర్. అదేంటి గేమ్ చేంజర్ సినిమా అంత రష్ శంకర్ ఏం చేశాడంటూ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. ఈ సినిమా విషయంలో మొదటి నుంచి గాడి తప్పారు. ఐతే సినిమాలో శంకర్ మార్క్ అంశాలు ఉన్నా వాటిని అనుకున్న విధంగా తీయలేకపోయారు.
గేమ్ చేంజర్ సినిమా Game Changer ఐదు గంటల రష్ ఉండగా దాన్ని 2 గంటల 50 నిమిషాలకు కుదించారు. ఇక ఈ సినిమా పాటల కోసమే దాదాపు 75 కోట్ల దాకా కర్చు పెట్టారని తెలిసిందే. దిల్ రాజు తన కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కించారు. ఐతే గేమ్ చేంజర్ విషయంలో రాం చరణ్ తన బెస్ట్ ఇచ్చినా సరే ఆడియన్స్ అంచనాలను మాత్రం అందుకోలేదు. సినిమా కు థమన్ మ్యూజిక్ అందించగా కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ఈ సినిమా టాకే వీక్ గా ఉంది.