Samantha – Naga Chaitanya : స‌మంత‌- నాగ చైత‌న్య విడాకుల ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేసిన ఆ హీరో ఎవ‌రో తెలుసా?

Authored By Sam C | The Telugu News | Published on: September 22, 2022, 6:30 pm

Samantha – Naga Chaitanya : టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్ నాగ చైత‌న్య‌, స‌మంత గ‌త ఏడాది అక్టోబ‌ర్ 2న విడాకులు తీసుకున్న విష‌యం తెలిసిందే. వారి విడాకుల నిర్ణ‌యం ఎంద‌రినో బాధించింది. కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానులు కూడా చాలా హ‌ర్ట్ అయ్యారు. . సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ విడాకుల ప్రకటన చేయగానే..లక్షలాదిమంది అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఈ వ్యవహారంపై నాగ చైతన్య తండ్రి, దక్షిణాది అగ్ర నటుడు నాగార్జున ఇప్పటివరకూ పెద్దగా స్పందించలేదు. కాని రీసెంట్‌గా సమంత-నాగ చైతన్యలు విడిపోవడంపై స్పందించారు. నాగ చైత‌న్య‌ సంతోషంగా లేడు. అదంతా నేను చూశాను. నా వరకైతే మంచిదే అయింది. అతనికి అదొక అనుభవం.

దురదృష్టకరం. ఇంకా దీని గురించి మధనపడాల్సిన అవసరం లేదు. అది అయిపోయింది. అది మన చేతుల్లో లేనిది అని అన్నారు.. అయితే సామ్ చైతూ విడాకుల విష‌యంపై అంద‌రు ఒకింత బాధ‌ను వ్య‌క్తం చేస్తుంటే ఓ హీరో మాత్రం ఏకంగా ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ ఇచ్చాడట . పేరుకు పెద్దమనిషి అయిన బిహేవియర్ మాత్రం చీప్ గా ఉంటుందంటున్నారు జనాలు. గతంలో సమంత తనతో సినిమాను రిజెక్ట్ చేసిందన్న పగతో సమంత బతుకు నాశనం అవుతుంటే చూసి సంతోషించాడట. అంతేకాదు తన సంతోషాన్ని నలుగురితో పంచుకుని పార్టీ చేసుకున్నాడ‌ట‌. అతనిని నెటిజ‌న్స్ దారుణంగా తిడుతున్నారు. ప్ర‌స్తుతం ఆ హీరో సినిమాలు చేసుకుంటూ త‌న లైఫ్‌ని మాత్రం బాగానే స‌రిదిద్దుకున్నాడ‌ట‌.

that hero happy with Samantha - Naga Chaitanya divorce

that hero happy with Samantha – Naga Chaitanya divorce

Samantha – Naga Chaitanya : అంత చీపా..

ఇంత‌కు ఎవ‌రు ఆ హీరో అని అంద‌రు తెగ ఆలోచిస్తున్నారు. ఇక 35 ఏళ్ల సమంత రెండో పెళ్ళికి సిద్దమవుతున్నారనేది తాజా వార్త. ఆధ్యాత్మికవేత్త సద్గురు బాబా దీని వెనకున్నారట. ఆయన సమంతను రెండో పెళ్ళికి ఒప్పించారని, ఒక అబ్బాయిని కూడా ఫిక్స్ చేశారనేది టాక్. మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సమంత మనసు మార్చి ఆయన సిద్ధం చేశారట. గత రెండు రోజులుగా ఈ వార్త మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది. ఇదంతా కొందరు కావాలని సృష్టిస్తున్న పుకారు అంటున్నారు. కొద్ది రోజుల క్రితం నాగ చైత‌న్య రెండో పెళ్లికి సంబంధించి కూడా కొన్ని వార్త‌లు హ‌ల్చల్ చేసిన విష‌యం తెలిసిందే.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp