Pushpa 2 : పుష్ప 2 కి రిలీజ్ కాకముందే అతిపెద్ద బ్యాడ్ న్యూస్..!!
Pushpa 2 ; అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ పుష్ప ‘ సినిమా ఎటువంటి రికార్డ్స్ ను బ్రేక్ చేసిందో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. దీంతో పుష్ప 2 సినిమా కోసం దేశమంతటా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కి సోషల్ మీడియాలో విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాకి బాగా కలిసి వస్తుందని బిజినెస్ పరంగా కూడా ప్లస్ అవుతుందని మైత్రి మూవీ మేకర్స్ భావించారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ ఫారిన్ ఫైటర్స్ తో చిత్రీకరిస్తున్నారు. అయితే సడన్గా మైత్రి మూవీ మేకర్స్ పై ఐటి రైడ్స్ కలకలం సృష్టించాయి. ఎటువంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా ఐటి అధికారులు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలపై తనిఖీలు నిర్వహించారు. ఇందులో పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక విషయాలు బయటపడినట్లు సమాచారం.
పూర్తి వివరాలు బయటకి రానప్పటికి నిర్మాతలపై ఆరోపణలు అయితే వస్తున్నాయి. అలాగే ఐటీ అధికారులు సుకుమార్ ని కూడా విచారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పుష్ప 2 సినిమా షూటింగ్ కి బ్రేక్ పడింది. పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలో ఐటీ దాడుల కారణంగా ఆగిపోవడం పుష్ప సినిమాకి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వాయిదా పడినట్లే అని ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తోంది. మరీ మైత్రి మూవీ మేకర్స్ వేగంగా కోలుకొని ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారో లేదో చూడాలి.