Kajal Aggarwal : కాజల్ అగర్వాల్‌ను అవమానించిన దర్శకుడు.. అవి తగ్గించుకోకపోతే నో చాన్స్ అంటూ కామెంట్స్
Kajal Aggarwal : కాజల్ అగర్వాల్ అనగానే ముందుగా అందరికీ గుర్తొచ్చేది చందమామ.. చాలా మంది కాజల్‌ను చందమామ అని పిలుస్తారంట. ఎందుకంటే ఆమె చందమామ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి హిట్ కొట్టిందని కాదు. ఆమె ముఖారవిందం కూడా అచ్చం చందమామ లాగే ఉంటుందని ఇండస్ట్రీలో కొందరు అంటున్నారు. కాజల్ అంటే కుర్రాళ్లకు ఏదో తెలియని ఫీలింగ్. ఆమె ప్రస్తుతం పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంది. కాజల్ అగర్వాల్ దాదాపు రెండేళ్ల నుంచి సినిమాలకు దూరంగా ఉంది. కెరీర్‌లో అవకాశాలు తగ్గుతున్నాయని భావించిన టైంలోనే బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లును పెళ్లాడిన చందమామ..
ఇటీవల పండంటి బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం కుటుంబంతో సంతోషంగా గడుపుతోంది. ఈనేపథ్యంలోనే కాజల్‌కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. కాజల్ తన కెరీర్‌లో సూపర్ డూపర్ హిట్స్ అందుకుంది. అందులో చందమామ, మగధీర, డార్లింగ్, బృందావనం, నేనే రాజునేనే మంత్రి వంటి చాలా సినిమాల్లో చేసింది. స్టార్ హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలోనూ పలు సినిమాలు చేసిన కాజల్..
Kajal Aggarwal: సినిమా చాన్స్ కావాలంటే అది చేయాల్సిందేనా
ఎంతో మంది అభిమానులన సంపాదించుకుంది. తాజాగా కాజల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించడానికి చూస్తోందని టాక్ వినబడుతోంది. శంకర్ డైరెక్ట్ చేస్తున్న భారతీయుడు -2 సినిమాలో కాజల్ అవకాశం కొట్టేసిందని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ డైరెక్టర్ కాజల్‌కు సినిమా చాన్స్ ఇస్తానని చెప్పాడట..కానీ ఒక కండిషన్ పెట్టాడట..ముందుగా తన బుగ్గలు తగ్గించుకోవాలని.. బాడీలో ఫ్యాట్ నెస్ తగ్గించాలని పేర్కొన్నాడట.. లేనియెడల చాన్స్ కష్టం అని చెప్పడంతో…కాజల్‌ను ఇలా అవమానిస్తారా అంటూ డైరెక్టర్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.