The Raja Saab Maruthi : ఒక్కరోజులో డిసైడ్ చేయొద్దు.. మార్పులతో రియల్ ‘రాజాసాబ్’ : మారుతి
ప్రధానాంశాలు:
The Raja Saab Maruthi : ఒక్కరోజులో డిసైడ్ చేయొద్దు.. మార్పులతో రియల్ ‘రాజాసాబ్’ : మారుతి
The Raja Saab Maruthi : ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘ది రాజాసాబ్’పై ప్రేక్షకుల స్పందన మిశ్రమంగా ఉందని దర్శకుడు మారుతి(Director Maruti) స్వయంగా అంగీకరించారు. సినిమా చూసిన అభిమానులు పూర్తిగా నిరాశ చెందలేదని, అలాగే పూర్తిగా సంతృప్తి కూడా చెందలేదని ఆయన వ్యాఖ్యానించారు. ట్రైలర్‌లో ప్రభాస్‌ను ఓల్డ్ గెటప్‌లో చూపించడంతో థియేటర్లలో ఆ సన్నివేశాల కోసం ప్రేక్షకులు వెతికారని అదే సమయంలో కథలోకి పూర్తిగా ఎక్కలేకపోయారని మారుతి వెల్లడించారు. ప్రభాస్ తొలిసారి హారర్ జానర్‌లో నటించిన ఈ చిత్రం జనవరి 9న విడుదలై, వింటేజ్ ప్రభాస్‌ను చూసి కొంతమంది ఆనందపడగా మరికొందరు కథలో గందరగోళం ఉందని అభిప్రాయపడుతున్నారు.
The Raja Saab Maruthi : ఒక్కరోజులో డిసైడ్ చేయొద్దు.. మార్పులతో రియల్ ‘రాజాసాబ్’ : మారుతి
The Raja Saab Maruthi మార్పులతో రియల్ ‘రాజాసాబ్’ : మారుతి
థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ వస్తున్నప్పటికీ చిత్రయూనిట్ ‘రాజాసాబ్.. కింగ్ సైజ్ బ్లాక్‌బస్టర్’ అంటూ సెలబ్రేషన్స్ ప్రారంభించింది. శనివారం జరిగిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారుతి, విమల్ థియేటర్‌లో ప్రీమియర్స్ సమయంలో జరిగిన గందరగోళాన్ని ప్రస్తావించారు. మీడియా మిత్రులు అర్ధరాత్రి 1.30 వరకు చలిలో ఎదురుచూసిన విషయాన్ని గుర్తు చేస్తూ జరిగిన అసౌకర్యానికి హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పారు. అర్ధరాత్రి సినిమా చూసి ఉదయం నాలుగు గంటలకే రివ్యూలు ఇచ్చిన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రభాస్ తనకు అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటానని మారుతి భావోద్వేగంగా చెప్పారు.
సాధారణంగా తొమ్మిది నెలల్లో సినిమా పూర్తి చేసే తాను ‘రాజాసాబ్’ కోసం మూడేళ్లపాటు కష్టపడి పనిచేశానని వెల్లడించారు. ప్రభాస్‌కు అభిమానులకు నచ్చేలా సినిమా తీశానని ముఖ్యంగా క్లైమాక్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని అన్నారు. సినిమా ఫలితాన్ని ఒక్కరోజులోనే నిర్ణయించకూడదని కనీసం పది రోజులు సమయం ఇవ్వాలని సూచించారు. కొత్త పాయింట్‌తో వచ్చిన సినిమాలు ప్రేక్షకులకు ఎక్కడానికి కొంత టైమ్ పడుతుందని చెప్పారు. ట్రైలర్‌లో చూపించిన ఓల్డ్ గెటప్ సన్నివేశాలు సినిమాలో లేకపోవడం వల్ల అభిమానులు నిరాశ చెందారని అంగీకరిస్తూ వాటిని సెకండాఫ్‌లో జత చేస్తున్నామని మారుతి వెల్లడించారు. అలాగే సాగదీతగా ఉన్న సన్నివేశాలను షార్ప్ చేశామని ఈ రోజు సాయంత్రం నుంచి ‘రియల్ రాజాసాబ్’ను ప్రేక్షకులకు చూపించబోతున్నామని స్పష్టం చేశారు.