The Raja Saab Distributors : వామ్మో ది రాజాసాబ్ ఇన్ని కోట్లు నష్టమా..? తల పట్టుకున్నడిస్ట్రిబ్యూటర్ వీడియో వైరల్..!
The Raja Saab Distributors : రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) కథానాయకుడిగా నటించిన భారీ చిత్రం ‘ది రాజాసాబ్’ ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చింది. సంక్రాంతి Sankrti కానుకగా విడుదలైన ఈ సినిమాకు ప్రీమియర్ల నుంచే అనూహ్యమైన స్పందన లభించింది. తొలి ఆట తర్వాత సినిమా గురించి మిక్స్‌డ్ టాక్ వినిపించినప్పటికీ ఆ టాక్ పాజిటివ్‌గా మారకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ ఊపందుకున్నాయి. క్రిటిక్స్ కూడా ఈ సినిమాపై తీవ్ర విమర్శలు చేయడంతో నెగిటివ్ ట్రెండ్ మరింత బలపడింది. అయితే ఆశ్చర్యకరంగా ఈ ప్రతికూల ప్రచారం మధ్యనూ బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ వసూళ్లు సాధిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో సినీ వర్గాల్లో చర్చకు దారి తీసింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ డిస్ట్రిబ్యూటర్‌కు సంబంధించిన వ్యక్తి ఆవేశంగా మాట్లాడుతూ..తలను బాదుకుంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
The Raja Saab Distributors : వామ్మో ది రాజాసాబ్ ఇన్ని కోట్లు నష్టమా..? తల పట్టుకున్నడిస్ట్రిబ్యూటర్ వీడియో వైరల్..!
The Raja Saab Distributors మిక్స్‌డ్ టాక్ మధ్యనూ వసూళ్లు.. ‘ది రాజాసాబ్’డిస్ట్రిబ్యూటర్ వీడియో హాట్ టాపిక్
ఈ ఘటన ‘ది రాజాసాబ్’ బిజినెస్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తుందా? అనే ప్రశ్నలకు దారి తీసింది. భారీ అంచనాల కారణంగా ది రాజాసాబ్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో బిజినెస్ జరుపుకుంది. కొన్ని ప్రాంతాల్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నేరుగా రిలీజ్ చేయగా మరికొన్ని సెంటర్లలో బయ్యర్లు ఫ్యాన్సీ రేట్లకు థియేట్రికల్ హక్కులను దక్కించుకున్నారు. ట్రేడ్ సమాచారం ప్రకారం నెల్లూరు జిల్లా థియేట్రికల్ రైట్స్ సుమారు 4.5 నుంచి 5 కోట్ల రూపాయల వరకు అమ్ముడయ్యాయి. జనవరి 8న ఏపీలో గ్రాండ్‌గా ప్రీమియర్లు నిర్వహించగా ఆ తర్వాత టాక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ వర్గీయుడు “ఇంకా రెండు మూడు రోజులు ఎలా ఉంటుందో తెలియదు రేపు చూద్దాం సార్” అంటూ తీవ్ర ఆవేశంతో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
సినిమాపై నడుస్తున్న నెగిటివ్ ప్రచారమే ఆయన ఆవేశానికి కారణమై ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీవై ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై సుమారు 400 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రానికి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఇషాన్ సక్సేనా నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రభాస్‌తో పాటు సంజయ్ దత్, బోమన్ ఇరానీ, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కీలక పాత్రల్లో నటించారు. కార్తీక్ పలని సినిమాటోగ్రఫీ అందించగా, ఎస్. థమన్ సంగీతం, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. జనవరి 9, 2026న విడుదలైన ‘ది రాజాసాబ్’ ఇప్పుడు టాక్, ట్రోల్స్, వసూళ్లతో ఇండస్ట్రీలో హాట్ డిస్కషన్‌గా నిలిచింది…
bRAAND Prabhas #TheRajaSaab 😭😂 https://t.co/oF20QqzSfq pic.twitter.com/TncJ0n9WCF
— bAbA (2.0) (@RounakDaa) January 9, 2026