Pushpa Movie : ఈ అరిగిపోయిన చెప్పులకు ‘పుష్ప’ సినిమాకు ఉన్న సంబంధమిదే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pushpa Movie : ఈ అరిగిపోయిన చెప్పులకు ‘పుష్ప’ సినిమాకు ఉన్న సంబంధమిదే..!

 Authored By mallesh | The Telugu News | Updated on :2 February 2022,7:00 am

Pushpa Movie : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాగా, ఈ చిత్రానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. నార్త్ ఇండియాలోనూ ప్రజలు ఈ చిత్రాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బీ టౌన్ సెలబ్రిటీలు, ప్రముఖులు ఈ మూవీ చూసి ఫిదా అయిపోతున్నారు. కాగా, ఈ పిక్చర్‌కు అరిగిపోయిన చెప్పులతో సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య డిస్కషన్ జరుగుతోంది. అలా ఎందుకు జరుగుతున్నదంటే..‘పుష్ప’ సినిమాలోని డైలాగ్స్, హీరో హుక్ స్టెప్స్ సోషల్ మీడియాలోఫుల్ ఫేమస్ అయ్యాయి.

ఇండియన్ క్రికెటర్సే కాదు.. ఫారిన్ క్రికెటర్స్ సైతం ‘తగ్గేదేలే’ అని డైలాగ్స్ చెప్తూ స్టెప్స్ వేస్తున్నారు. ఆ వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అలా మొత్తంగా ‘పుష్ప’ సినిమాకు ఇంటర్నేషనల్ లెవల్ లో ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇకపోతే చిత్రంలో ‘శ్రీవల్లి’ సాంగ్ కు బన్నీ డ్యాన్స్ చేస క్రమంలో చేతికి ఉన్న కాలి చెప్పును విడిచిపెడతాడు. తర్వాత మళ్లీ దానిని తొడుక్కుంటాడు. అలా ఆ సాంగ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాడు.కాగా, ఆ హుక్ స్టెప్ ను చాలా మంద కాపీ కొట్టేసి ఇన్ స్టా రీల్స్ లో వీడియోలు చేశారు.

the relationship between chappal and pushpa movie

the relationship between chappal and pushpa movie

Pushpa Movie : పాన్ ఇండియా స్టార్ గా బన్నీ..

అలా తాము కూడా బన్నీ మాదిరిగా డ్యాన్స్ చేసేందుకుగాను ప్రయత్నించారు. తాజాగా ఓ ఎయిర్ హోస్టెస్ కూడా ఆ స్టెప్ ట్రై చేసింది. ఈ సంగతులు అలా ఉంచితే.. ఈ హుక్ స్టెప్ కు లింక్ చేస్తూ ప్రజెంట్ ఓ ఫొటో మీమ్ వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోలు అరిగిపోయిన చెప్పులున్నాయి. కాగా, అల్లు అర్జున్ పాట కోసం చాలా టేక్ లు తీసుకున్నాడని, దాంతో చెప్పులు ఆ విధంగా అరిగిపోయాయని నెటిజన్లు కొందరు ఆ మీమ్ చూసి జోక్ లు వేసుకుంటున్నారు. అయితే, చాలా మంది ఆ మీమ్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది