Rajamouli : రాజమౌళి కెరీర్ మొత్తం లో దారుణమైన లాస్ లు పెట్టిన సినిమా ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Rajamouli : రాజమౌళి కెరీర్ మొత్తం లో దారుణమైన లాస్ లు పెట్టిన సినిమా ఇదే !

 Authored By sekhar | The Telugu News | Updated on :17 July 2023,9:00 am

Rajamouli : ప్రపంచ స్థాయిలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ స్థాయిని ఒక్కసారిగా పెంచేసిన దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి. ఇప్పటివరకు ఒక పరాజయం కూడా లేదు. జక్కన్న తీసిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. బాహుబలి సినిమాతో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అన్ని రికార్డులను బ్రేక్ చేయడం జరిగింది. బ్యాక్ టు బ్యాక్ వెయ్యి కోట్లు సాధించిన డైరెక్టర్ గా బాహుబలి, RRR లతో సత్తా చాటారు. సినిమాలో ప్రతి సీన్ చాలా పర్ఫెక్ట్ గా వచ్చేవరకు.. రాజమౌళి తీస్తూనే ఉంటారని సంగతి తెలిసిందే.

“RRR” సినిమా రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తీసుకొచ్చింది. కారణం ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావటం. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన నిర్మాణ సంస్థలు ఇంకా ఇండియాలో అయితే బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు రాజమౌళితో సినిమా చేయడానికి క్యూ కడుతున్నారు. ఇంతగా తిరుగులేని దర్శకుడు అనిపించుకున్న రాజమౌళి కెరియర్ మొత్తంలో దారుణమైన లాస్ లు తెచ్చి పెట్టిన సినిమా ఉందట. ఆ సినిమా మరేదో కాదు నితిన్ తో తీసిన “సై”.

సై సినిమా స్టోరీ విని.. రాజమౌళికి నో చెప్పిన టాలీవుడ్ స్టార్ హీరో.. |  tollywood star hero who said no to rajamouli nithin sye movie details,  tollywood star hero , no to rajamouli, nithin ,sye

నితిన్ జెనీలియా కలిసి నటించిన ఈ సినిమాలో శశాంక్.. ప్రదీప్.. రాజీవ్ కనకాల కీలకపాత్రలు పోషించారు. 2004లో “సై” సినిమా విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఎనిమిది కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం లాంగ్ రన్..లో 12 కోట్లు మాత్రమే సొంతం చేసుకుంది. రాజమౌళి ఎక్కించిన మూవీలు అన్ని సాధించిన కలెక్షన్లు ఒక్కటైతే వాటితో కంపేర్ చేస్తే సై సినిమా పెద్దగా లాభాలు సాధించలేదట. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు సినిమా పనిలో ఉన్నారు. వచ్చే ఏడాది నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. గ్లోబల్ స్థాయిలో ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది