Serials : ఇక నుంచి సీరియల్స్‌కు సెన్సార్.. ముద్దులు, కౌగిలింతలకు నో..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Serials : ఇక నుంచి సీరియల్స్‌కు సెన్సార్.. ముద్దులు, కౌగిలింతలకు నో..!

 Authored By mallesh | The Telugu News | Updated on :24 October 2021,5:45 pm

Serials : ఇప్పుడంటే థియేటర్స్‌లో సిల్వర్ స్క్రీన్‌పై సినిమాలు, ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు చూస్తూ ప్రజలు వినోదం పొందుతున్నారు. థియేట్రికల్, డిజిటల్ రెండిటిలోనూ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజలు థియేటర్ లో సినిమా ఎక్స్‌పీరియెన్స్ చేస్తూనే, డిఫరెంట్ కంటెంట్ కోసం ఓటీటీల బాట పడుతున్నారు. అయితే, ఒకప్పుడు అటువంటి పరిస్థితులు లేవు. జనానికి టెలివిజనే వినోదం పంచేది. అందులో ప్రసారమయ్యే సీరియల్స్ చూస్తూ ఇంటిల్లిపాది కూర్చొని చక్కగా ఎంజాయ్ చేసేవారు. అలా వెండితెరతో సమానంగా బుల్లితెరకు క్రేజ్ ఉంది. ముఖ్యంగా గృహిణులు, వృద్ధులు బుల్లితెరపైన ప్రసారమయ్యే సీరియల్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు. సీరియల్స్ మాత్రమే కాదు బుల్లితెరపైన ప్రసారమయ్యే సినిమాల కోసం కూడా ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తుండేవారు. కానీ, ప్రజెంట్ అటువంటి సిచ్యువేషన్స్ లేవు.

there will be no kiss hug scenes in serials

there-will-be-no-kiss-hug-scenes-in-serials

ఒకప్పుడు సినిమాలు టెలివిజన్‌లో వస్తున్నాయంటే.. ఆ టైమ్ కోసం వేచి చూసి ఆ సినిమాలను చూసేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కావాల్సిన సినిమాను అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లోనే చూసేస్తున్నారు. కాగా, టెలివిజన్‌లోనూ సీరియల్స్ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. సినిమాలకు ధీటుగా సీరియల్స్ మేకింగ్ కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే సీరియల్స్‌లో నటీ నటులు హద్దులు మీరుతున్న సన్నివేశాలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయని కంప్లయింట్స్ ప్రభుత్వానికి వచ్చాయట. అయితే, అది మన దేశ ప్రభుత్వం కాదండోయ్.. పాక్ ప్రభుత్వం.. సినిమాల్లో లాగానే సీరియల్స్‌లోనూ ముద్దులు, కౌగిలింతలతో రెచ్చిపోతున్నారని, ఇంటిల్లిపాది కూర్చొని సీరియల్స్ చూసే పరిస్థితులు అస్సలు లేవని ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం అటువంటి సీరియల్స్‌పైన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

Serials : ఫ్యామిలీ మొత్తం కూర్చుని సీరియల్స్ చూసే పరిస్థితులు లేవు..!

సన్నిహిత సన్నివేశాలు కాని ముద్దులు కాని కౌగిలింతలు కాని ఉండొద్దని, అటువంటి దృశ్యాలను ప్రచారం చేయొద్దని పీఈఎంఆర్ఏ టీవీ చానళ్లకు ఆదేశాలు ఇచ్చింది. పాకిస్థాన్ ప్రజానీకం నుంచి కంప్లయింట్స్ రావడంతోనే ఇటువంటి సీన్స్ సీరియల్స్‌లో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది