Bichagadu 3 : స్టోరీ అద్దిరిపోయింది .. బిచ్చగాడు మూడో పార్ట్ కథ ఇదే ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bichagadu 3 : స్టోరీ అద్దిరిపోయింది .. బిచ్చగాడు మూడో పార్ట్ కథ ఇదే !

 Authored By sekhar | The Telugu News | Updated on :30 May 2023,3:00 pm

ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగంలో సీక్వెల్ సినిమాల హడావిడి కనిపిస్తోంది. సూపర్ డూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ వస్తూ ఉన్నాయి. ఈ రకంగా సీక్వెల్స్ వచ్చిన చాలా సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. దీంతో ఫిలిం మేకర్స్….హీరోలు ఈ దిశగా ఎక్కువ ప్లాన్స్ వేసుకుని సినిమాలో ఒప్పుకుంటున్నారు. ఈ రకంగానే దక్షిణాది సినిమా రంగంలో విజయ్ ఆంటోని “బిచ్చగాడు”తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మొదటి భాగం శశి డైరెక్షన్ చేయగా రెండో పార్ట్ స్వయంగా విజయ ఆంటోనీనే దర్శకత్వం వహించారు.

This is the story of the third part of the Bichagadu 3

This is the story of the third part of the Bichagadu 3

బిచ్చగాడు సినిమా మొదటి భాగం 2016లో విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదలయ్యి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టింది. రెండో భాగం కూడా అదే రీతిలో ఘన విజయం సాధించటంతో.. తాజాగా “బిచ్చగాడు” మూడో భాగం తెరకెక్కిస్తున్నట్లు స్వయంగా విజయ్ ఆంటోనీ ప్రకటించడం జరిగింది. “బిచ్చగాడు 3” సినిమాకి కూడా తానే దర్శకత్వం వహిస్తున్నట్లు విజయ్ ఆంటోనీ స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో అటు తమిళంలో ఇటు తెలుగులోనూ ఉత్కంఠ నెలకొంది.

Vijay Antony confirms Bichagadu 3 and will be released in 2025 - Sakshi

అయితే మూడో విభాగం స్టోరీ బ్రదర్ సెంటిమెంట్ తో తీసే ఆలోచనలో విజయ్ ఆంటోనీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇదే గనుక నిజమైతే స్టోరీ అదిరిపోతుందని తాజా వార్తపై సినీ ప్రేమికులు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే డైలాగ్ వర్షన్ కి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిందని సమాచారం. బిచ్చగాడు మొదటి భాగంలో తల్లి సెంటిమెంట్ రెండో భాగంలో బ్రదర్ మరియు సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కించారు. రెండు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు మూడో విభాగం బ్రదర్ సెంటిమెంట్ తో తెరకెక్కించనున్నట్లు టాక్ నడుస్తోంది.

Also read

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది