Tollywood Producers : షూటింగ్స్ బంద్ పెడ‌తామ‌న్న నిర్మాత‌లు.. రెమ్యున‌రేష‌న్స్ త‌గ్గిస్తారా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Tollywood Producers : షూటింగ్స్ బంద్ పెడ‌తామ‌న్న నిర్మాత‌లు.. రెమ్యున‌రేష‌న్స్ త‌గ్గిస్తారా?

 Authored By prabhas | The Telugu News | Updated on :29 July 2022,6:20 pm

Tollywood Producers : టాలీవుడ్ పరిశ్ర‌మ కొన్నాళ్లుగా అనేక విప‌త్క‌ర ప‌రిస్థితుల మ‌ధ్య కొట్టుమిట్టాడుతున్న విష‌యం తెలిసిందే. కరోనాతో పాటు సినిమా టికెట్ రేట్ల వంటి విషయాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి . ఇది చాలదు అన్నట్టుగా ఇటీవల సినీ కార్మికులు నిరసన చేపట్టారు. గత నాలుగేళ్లుగా తమకు జీతాలు పెంచడం లేదంటూ సినీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్ర‌మంలో షూటింగ్ బంద్ చేస్తామంటూ వారు డిమాండ్ చేశారు. ఎటకేలకు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కలగజేసుకుని సినీ పెద్దలతో చర్చించి సమస్యను సద్దుమణిగేలా చేయగలిగారు. ఈ తిప్పలు తీరాయ‌ని అనుకుంటున్న స‌మ‌యంలో టాలీవుడ్ లో షూటింగ్ లు బంద్ కానున్నాయంటూ ప్రక‌టించారు. దీంతో టాలీవుడ్ ప‌రిస్థితి గురించి పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తుంది.దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం ఈ వీడియో చూడండి.

మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.కరోనా కారణంగా సినిమా నిర్మాతలకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ఒకవైపు ప్రజలు థియేటర్లలోకి రావడం మానేయగా, మరో వైపు టికెట్ రేట్లు ఓటీపీ వంటి సమస్యలు నిర్మాతలను కలవరపెడుతున్నాయి. ఈ క్ర‌మంలో ఆగస్టు 1 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటించడంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ సమస్య ఎప్పుడు కొలిక్కి వస్తుందో తెలియదు కానీ.. దీని ప్రభావం మాత్రం చాలా సినిమాలపై పడబోతుందని పలువురు అంటున్నారు. షూటింగ్ బంద్ అనేది ముఖ్యంగా ప్ర‌భాస్ న‌టిస్తున్న‌స‌లార్, ప్రాజెక్ట్ కెల‌పై ప‌డ‌నుంది. అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాలు తెరకెక్కుతుండటంతో, ఇప్పుడు అర్ధాంతరంగా షూటింగ్ బంద్ చేస్తే, నిర్మాతలకు భారీ నష్టాలు రావడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

Tollywood Producers who will stop the shootings

Tollywood Producers who will stop the shootings

అటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మూడు సినిమాలు గాడ్‌ఫాదర్, భోళాశంకర్, వాల్తేరు వీరయ్య లపై కూడా ఈ సినిమా షూటింగ్స్ బంద్ ప్రభావం గట్టిగానే పడనుంది. నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కూడా ఆగిపోనుంది. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న రెండు సినిమాలు అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాతో పాటు, వంశీ పైడిపల్లి తమిళ హీరో విజయ్ కాంబినేషన్‌లో రాబోయే సినిమాలపై కూడా ఈ ఎఫెక్ట్ పడనుంది. విజయ్ దేవరకొండ పూరీ జగన్నాధ్ కాంబినేషన్‌లో వస్తున్న జనగణమన, నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘దసరా’.. రవితేజ ‘రావణాసుర’.. అల్లరి నరేష్ ‘మారేడుమిల్లి ప్రజానీకం’, ఖుషీ సినిమా.. ఇలా దాదాపుగా చిన్నవి పెద్దవి కలిపి 30 సినిమాలు వరకు షూటింగ్స్ నిలిచిపోయే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి.

సినిమా షూటింగ్ బంద్‌ల నిర్ణ‌యం అనేక దఫాలుగా చర్చలు జరిపిన తర్వాత తీసుకున్నారు. తదుపరి చర్చలు, సమస్యల‌కు సంబంధించి ప‌రిష్కారం కనుగొనేవరకు వరకు నిలిపివేయాలని నిర్ణయించారు. సినిమాల థియేట్రిక‌ల్ వ‌సూళ్లు తక్కువ స్థాయికి పడిపోవడం.. ప్రొడక్షన్ ఖర్చులు విపరీతంగా పెరిగడంతో.. పరిశ్రమను పునర్నిర్మించే ప్రయత్నంలో నిర్మాతల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సినిమా షూటింగ్‌లను నిలిపివేయాలనే నిర్ణయం పలు అగ్ర హీరోల చిత్రాలపై ప్రభావం చూపనుంది. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. షూటింగ్‌ల బంద్ నిర్ణయంపై అగ్ర హీరోలు రాంచరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌తో చర్చలు జరిపారు. అయితే వీరు ముగ్గురు కూడా రెమ్యూనరేషన్‌ తగ్గించుకోవడానికి ముందుకొచ్చిన‌ట్టు తెలుస్తుంది.

సినిమా బడ్జెట్ కంట్రోల్‌లో భాగంగా రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటామన్న ఆ హీరోలు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక, త్వరలోనే మిగతా హీరోలతో కూడా చర్చలు జరుపుతామని నిర్మాతలు చెబుతున్నారు. అంద‌రు నిర్మాత‌ల బాగోగుల‌ని దృష్టిలో పెట్టుకొని రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుంటే మ‌ళ్లీ షూటింగ్ మొద‌ల‌య్యే ఛాన్స్ ఉంది. ఓటీటీ రిలీజ్‌పైనా కఠిన నిర్ణయాలు తీసుకుంది ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌. భారీ బడ్జెట్‌ సినిమాలు థియేటర్‌లో రిలీజైన 10 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేయాలని తేల్చి చెప్పింది. మామూలు బడ్జెట్‌తో తీసిన సినిమాలను నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్‌ చేసుకోవచ్చని సూచించింది. అలాగే ఆరు కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాల ఓటీటీ రిలీజ్‌ అంశంపై ఫెడరేషన్‌తో చర్చించాకే ఓ నిర్ణయం తీసుకుంటామంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది