Rave Party : ఏంటి.. రేవ్‌పార్టీలో టాలీవుడ్ యాంకరా.. ఆమె పేరు ఎందుకు బ‌య‌ట‌కొచ్చింది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Rave Party : ఏంటి.. రేవ్‌పార్టీలో టాలీవుడ్ యాంకరా.. ఆమె పేరు ఎందుకు బ‌య‌ట‌కొచ్చింది..!

Rave Party : నగరాల్లో పార్టీ కల్చర్ రోజు రోజుకి మ‌రింత పెరుగ‌తుంది. డబ్బున్న యువత అయితే.. ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు తాజాగా రేవ్‌ పార్టీ అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. అందుకు కారణం.. బెంగళూరులో నిర్వహించిన ఓ రేవ్‌ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు పట్టుబడటమే. ఇప్పటికే తెలుగు సినిమా నటీనటులు.. హేమా, శ్రీకాంత్‌, జానీ మాస్ట‌ర్‌ ఈ ఘటనపై […]

 Authored By ramu | The Telugu News | Updated on :21 May 2024,3:30 pm

Rave Party : నగరాల్లో పార్టీ కల్చర్ రోజు రోజుకి మ‌రింత పెరుగ‌తుంది. డబ్బున్న యువత అయితే.. ఈ పార్టీలకు బానిసలు అయిపోతున్నారడంలో అతిశయోక్తి లేదు. ఇప్పుడు తాజాగా రేవ్‌ పార్టీ అనే మాట రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతోంది. అందుకు కారణం.. బెంగళూరులో నిర్వహించిన ఓ రేవ్‌ పార్టీలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు, పలువురు రాజకీయ ప్రముఖులు పట్టుబడటమే. ఇప్పటికే తెలుగు సినిమా నటీనటులు.. హేమా, శ్రీకాంత్‌, జానీ మాస్ట‌ర్‌ ఈ ఘటనపై స్పందించారు కూడా. ఈ పార్టీలో హేమా పాల్గొందని తొలుత సమాచారం రాగా.. కాదంటూ హేమ ప్రకటన చేసింది. బెంగళూరు పోలీసులు మాత్రం ఆమె రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు నిర్ధారించారు

Rave Party అంతా స‌స్పెన్స్..

రేవ్ పార్టీ అంటే ఆల్కహాల్ తో పాటు డ్రగ్స్ కూడా ఉంటాయి. చీకటి గదిలో లేజర్ లైట్ల వెలుగులో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఫుడ్,కూల్ డ్రింక్స్, ఆల్కహాల్, సిగరెట్లు, కొకైన్, హషిష్, చరాస్, ఎల్ఎస్ డి… ఒక్కటేమిటి యువత అన్నీ మరిచి చిందులు వేయడానికి ఈ పార్టీలో అన్ని ఏర్పాట్లు ఉంటాయి. అయితే, రేవ్ పార్టీకి పరిచయస్తులనే ఆహ్వానిస్తారు. బెంగళూరు రేవ్ పార్టీలో బయటకు వస్తున్న వార్తలు ట్విస్టులపై ట్విస్టులుగా కనిపిస్తున్నాయి ..ఆంధ్రాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఓ మంత్రికి కారు ఆ ప్రాంతంలో లభ్యం కావ‌డంతో అనేక సందేహాలు త‌లెత్తుతున్నాయి. మంత్రి కారు విషయంలో ప్రముఖ యాంకర్, ఆ పార్టీ కార్యకర్తగా ఇటీవల ప్రచారం చేసిన సెలబ్రిటీ బయటకు రావడం మరింత ఆసక్తిగా మారింది.

Rave Party ఏంటి రేవ్‌పార్టీలో టాలీవుడ్ యాంకరా ఆమె పేరు ఎందుకు బ‌య‌ట‌కొచ్చింది

Rave Party : ఏంటి.. రేవ్‌పార్టీలో టాలీవుడ్ యాంకరా.. ఆమె పేరు ఎందుకు బ‌య‌ట‌కొచ్చింది..!

అయితే రేవ్ పార్టీ సందర్భంగా వైసీపీకి చెందిన ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వంలోని మంత్రికి సంబంధించిన స్టిక్కర్ ఉన్న బెంజ్ కార్ సీజ్ కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నేత, ఏపీ మంత్రికి చెందినట్టు భావిస్తున్న బెంజ్ కారులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ యాంకర్ వెళ్లినట్టు ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నది. ఆ యాంకర్ ఇటీవల వైసీపీ పార్టీకి ప్రచారం చేస్తూ ఇతర పార్టీలపై ఘాటైన వ్యాఖ్యలు చేయడం కొంత వివాదంగా మారింది. అయితే బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన బెంజ్ కారు తనది కాదని సదరు మంత్రి ఖండించారు. దాంతో ఇప్పుడు ఆ స్టిక్కర్ చుట్టే అసలు కథ తిరుగుతున్నది. కొందరైతే మంత్రి స్టిక్కర్ ఉన్న కారులో యాంకర్ వెళ్లి ఉండాలనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రేవ్ పార్టీలో టాలీవుడ్ ప్రముఖులు కూడా పట్టుబట్టారు. ఆ రేవ్ పార్టీకి తాము వెళ్లలేదని పలువురు వీడియోల రూపంలో చెప్పుకోవాల్సి వస్తోంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది