Akshaya Prince : ఆ స్టార్ సెలబ్రిటీ లక్ష పెట్టి నన్ను బుక్ చేసుకుని… తర్వాత 10 మందితో…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Akshaya Prince : ఆ స్టార్ సెలబ్రిటీ లక్ష పెట్టి నన్ను బుక్ చేసుకుని… తర్వాత 10 మందితో…!

 Authored By aruna | The Telugu News | Updated on :19 February 2024,1:45 pm

Akshaya Prince  : ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఫేమస్ అవుతూ వస్తున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న ఎంతోమంది ఇప్పుడు సినీ అవకాశాలను కూడా దక్కించుకుని కెరియర్ పరంగా దూసుకెళ్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఆడ మగ మాత్రమే కాకుండా హిజ్రాలు కూడా చాలామంది ఉన్నారు. అయితే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత హిజ్రాలు కూడా సోషల్ మీడియా లో వీడియోలు చేస్తూ వైరల్ గా మారుతున్నారు. ఈ క్రమంలోనే కొందరు హిజ్రాలు వారి యొక్క హక్కుల గురించి ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు వారిని పట్టించుకోవడంలేదని తెలియజేస్తూ వస్తున్నారు. అందుకే చాలామంది హిజ్రాలు డబ్బు అడుక్కొని జీవనం సాగిస్తున్నారు. మరికొందరు మాత్రం అలాంటి పనులు కూడా చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారని ఈ సందర్భంగా వారు తెలియజేస్తూ వస్తున్నారు.

ఇక్కడ గమనించ్చ దగిన విషయం ఏంటంటే ట్రాన్స్ జెండర్లకి పని చేసుకోవడానికి పని కూడా దొరకదు. దీంతో చాలామంది అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి సిద్ధపడుతున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా వారి యొక్క హక్కుల కోసం పోరాడే ట్రాన్స్ జెండర్ అక్షయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…ప్రభుత్వాలు హిజ్రాలకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని , తమను సరిగా పట్టించుకోవడం లేదని తెలియజేశారు. అందుకే చాలామంది హిజ్రాలు షాప్ ఓపెనింగ్ జరిగిన , ఏదైనా ఫంక్షన్ జరిగినా వెంటనే అక్కడికి వెళ్లి భిక్షాటన చేస్తున్నారని తెలియజేశారు. అయితే అలా వెళ్లిన సమయంలో వారికి అవమానాలు కూడా జరుగుతాయట. ఈ క్రమంలోనే వారు ఆగ్రహానికి గురైనప్పుడు అసాంఘిక చర్యలకు పాల్పడతారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అంతేకాదు వారు ఇలాంటి కార్యక్రమాలు ఉన్న చోట అడ్డుపడినప్పుడు పదివేలు ఇస్తామని చెప్పి పక్కకు తీసుకువెళ్లి తర్వాత 1000 రూపాయలు చేతిలో పెట్టి పంపించే వారట.

ఇలా ప్రతి విషయంలో ట్రాంజెండర్లకి అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. అలాగే కొన్ని సందర్భాలలో పలువురు సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా వారిని ఆ పని కోసం తీసుకెళ్లి ముందు ఒకరు ఇద్దరు అని చెప్పి తర్వాత పదిమంది వచ్చేవారిని ఆమె తెలియజేశారు. ఇలా ప్రతి హిజ్రా తన జీవితాన్నిఆనందంగా గడపలేకపోతున్నారని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. అందుకే తమకు కూడా మంచి హక్కులను కల్పించినట్లయితే తాము కూడా అందరికంటే గొప్పగా బ్రతికి చూపిస్తామంటూ ఈ సందర్భంగా అక్షయ ప్రిన్సి తెలియజేశారు. అలాగే సమాజంలో కూడా తమకు మర్యాద లభించదని వాడు అలా మాట్లాడుతున్నాడు ఇలా నడుస్తున్నాడని చులకనగా చూస్తారు అంటూ వివిధ రకాల పేర్లతో పిలుస్తారు అంటూ ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. అయితే చాలామంది హిజ్రాలు వారి జీవితాన్ని చాలా ఆనందంగా గడిపేస్తారు అనుకుంటారు కానీ మా బాధ మాకే తెలుసు అంటూ ఈ సందర్భంగా ట్రాన్స్ జెండర్ అక్షయ ప్రిన్సి తేలియజేశారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది