Trivikram : తెలుగు సినిమా ప్రేక్షకుల వెంట్రుకలు నిక్క బొడుచుకునే బిగ్ న్యూస్ : ఆ ఇద్దరు హీరోలతో త్రివిక్రమ్ భారీ మల్టీ స్టారర్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Trivikram : తెలుగు సినిమా ప్రేక్షకుల వెంట్రుకలు నిక్క బొడుచుకునే బిగ్ న్యూస్ : ఆ ఇద్దరు హీరోలతో త్రివిక్రమ్ భారీ మల్టీ స్టారర్ !

 Authored By aruna | The Telugu News | Updated on :27 May 2023,12:00 pm

Trivikram : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఎస్ఎస్ఎంబి28 సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ లతో సినిమ ప్లానింగ్ తో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈసారి త్రివిక్రమ్ ఇద్దరు హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయాలని అనుకుంటున్నారట. త్రివిక్రమ్ ఆల్రెడీ మెగా హీరోలతో మల్టీస్టారర్ చేయాలని ఎన్నో ఏళ్లుగా కృషి చేస్తున్నాడు.

చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో ఎప్పటినుంచో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇప్పటివరకు ముందుకు కదల్లేదు. అయితే మెగా మల్టీ స్టారర్ మూవీ ఇప్పట్లో కాదని డిసైడ్ అయిన త్రివిక్రమ్ వేరే హీరోలతో మల్టీ స్టారర్ చేయాలని డిసైడ్ అయ్యాడట. త్రివిక్రమ్ తో మల్టీస్టారర్ మూవీ అంటే ఏ హీరోలు అయినా ఒప్పుకుంటారు. ముఖ్యంగా త్రివిక్రమ్ మల్టీ స్టారర్ కథ రాసుకుంటే మాత్రం ముందు ఆ ఇద్దరిని ఫిక్స్ చేసుకునే కథ సిద్ధం చేశాడు. అయితే త్రివిక్రమ్ మల్టీస్టారర్ సినిమాలో ఒకరు తెలుగు హీరో, మరొకరు తమిళ హీరో ఉంటారని టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్లుగా త్రివిక్రమ్ తో సినిమా ప్లానింగ్ లో ఉన్న ఒక కోలీవుడ్ హీరో,

Trivikram is a huge multi starrer with those two heroes

Trivikram is a huge multi starrer with those two heroes

తెలుగులో స్టార్ హీరో ఇద్దర్ని పెట్టి త్రివిక్రమ్ మల్టీ స్టారర్ చేస్తున్నారు. ఇది కనుక నిజమైతే త్రివిక్రమ్ 500 కోట్లు, 1000 కోట్లతో సినిమా రేంజ్ కి వెళ్లినట్టు. తన కథలతో తన మాటలతో ప్రేక్షకులను అలరించే త్రివిక్రమ్ ఈసారి మల్టీ స్టారర్ సినిమాతో పెద్ద స్కెచ్ వేశాడని తెలుస్తుంది. అయితే త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఆసక్తిగా ఉన్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ లతో మల్టీ స్టారర్ సినిమా చేయొచ్చు కదా అని అభిమానులు కోరుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. మరీ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆ కాంబినేషన్ లో సినిమా చేస్తాడో లేదో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది