Comedian Ali : మొత్తానికి ఆలీ అడ్డంగా దొరికిపోయాడుగా.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Comedian Ali : మొత్తానికి ఆలీ అడ్డంగా దొరికిపోయాడుగా.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్

Comedian Ali : బాల న‌టుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆ త‌ర్వాత హీరోగా, క‌మెడీయ‌న్‌గా రాణించాడు. ప్ర‌స్తుతం కెరీర్‌లో బిజీగా ఉన్నారు. సినిమా పరిశ్రమలో అందరివాడుగా పేరున్న కమెడియన్ ఆలీ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అప్తుడిగా పేరు తెచ్చుకొన్నాడు. పవన్ నటించే సినిమాలో ఆలీ తప్పకుండా ఉండేవారంటే.. వారిద్దరి మధ్య అనుబంధానికి చిహ్నంగా ఉండేవారు. అయితే తన సన్నిహితుడిని విభేదించి ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్ప‌టి […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Comedian Ali : మొత్తానికి ఆలీ అడ్డంగా దొరికిపోయాడుగా.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్

Comedian Ali : బాల న‌టుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆ త‌ర్వాత హీరోగా, క‌మెడీయ‌న్‌గా రాణించాడు. ప్ర‌స్తుతం కెరీర్‌లో బిజీగా ఉన్నారు. సినిమా పరిశ్రమలో అందరివాడుగా పేరున్న కమెడియన్ ఆలీ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అప్తుడిగా పేరు తెచ్చుకొన్నాడు. పవన్ నటించే సినిమాలో ఆలీ తప్పకుండా ఉండేవారంటే.. వారిద్దరి మధ్య అనుబంధానికి చిహ్నంగా ఉండేవారు. అయితే తన సన్నిహితుడిని విభేదించి ఆలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్ప‌టి నుండి ఆలీపై కాస్త వ్య‌తిరేఖ‌త నెల‌కొంది. గత ఎన్నికల్లో ఆలీ పోటీ చేయడానికి ఉత్సాహం చూపారు. అయితే ఆయన పేరును పార్లమెంట్ అభ్యర్థిగా పరిశీలించారు.

Comedian Ali రెడ్ హ్యాండెడ్‌గా..

నంద్యాల గానీ, కర్నూలు స్థానం నుంచి పోటీ చేసేలా హామి కూడా ఇచ్చారని సమాచారం. అయితే ఆయనకు సీటు కేటాయించకపోవడంతో మరింత నిరాశకు గురయ్యారు. అలాగే జగన్ వ్యవహరించే తీరు కూడా నచ్చకపోవడం కూడా ఓ కారణంగా మారిందంటారు. అప్పటి నుంచి పార్టీ క్రీయాశీలక కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇటీవ‌ల స్నేహితులు, సన్నిహితుల సూచన మేరకు సినిమా కెరీర్‌ను కొనసాగించేలా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడికి రాజీనామాను చేరవేశారు. దాంతో ఆయన రాజకీయ ప్రస్థానానికి బ్రేక్ పడింది.

Comedian Ali మొత్తానికి ఆలీ అడ్డంగా దొరికిపోయాడుగా ఓ రేంజ్‌లో ట్రోలింగ్

Comedian Ali : మొత్తానికి ఆలీ అడ్డంగా దొరికిపోయాడుగా.. ఓ రేంజ్‌లో ట్రోలింగ్

ఇక ఆలీ అప్పుడ‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌ల‌లో కూడా క‌నిపించి సంద‌డి చేస్తుంటారు. తాజాగా ఓ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తూ సోషల్ మీడియా జనాలకు దొరికిపోయారు. గతంలో ఇదే అలీ బెట్టింగ్ ల వేయద్దంటూ గొప్పగా చెప్పి మన్ననలు పొందారు. ఇప్పుడు తనే ఓ బెట్టింగ్ యాప్ ని డబ్బుల‌కి ఆశపడి ప్రమోట్ చేయటంతో జనాలు జీర్ణించుకోలేకపోయారు. చెప్పిన మాటకు చేసే చేష్టకు సంభంధం లేదా అంటున్నారు. అలీతో స‌ర‌దాగా టైమ్ లో అలీ శివాజీని ఓ ఇంటర్వ్యూ చేసినప్పుడు బెట్టింగుల జోలికి పోవొద్ద‌ని, జీవితాలు నాశనం చేసుకోవొద్ద‌ని, డ‌బ్బులు సంపాదించ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు కానీ, ఇలా ఈజీ మ‌నీ కోసం ఆశ ప‌డొద్ద‌ని నీతులు చెప్పి ఇప్పుడు బెట్టింగ్ యాప్‌ని ప్ర‌మోట్ చేస్తూ డ‌బ్బులు సంపాదించుకొంటున్నాడ‌ని తిట్టి పోస్తున్నారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది