NTR 30 : ఎన్టీఆర్ 30 కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకు వచ్చేందుకు అంత కష్టపడుతున్నారా..?
NTR 30 : ఎన్టీఆర్ 30.. తాజాగా ప్రకటన వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా. ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆర్‌ఆర్ఆర్ సినిమాలో కొమురం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్స్ తో పాటు హాలీవుడ్ క్రేజీ స్టార్స్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20న ఆర్‌ఆర్ఆర్ సినిమా నుంచి కొమరం భీం లుక్ రిలీజ్ చేయనున్నారు.

trying for bollywood heroine for ntr-30-movie
కాగా ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ 30 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయాల్సింది. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రాం, ఎస్ రాధకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్టు అధికారకంగా ప్రకటన కూడా వచ్చింది. అయితే కారణాలు ఏవైనా ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఎన్టీఆర్ 30వ సినిమాకి ‘జనతా గ్యారేజ్’ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వం వహించనున్నట్టు తాజాగా ప్రకటన వచ్చింది.
NTR 30 : బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కియారా ఎన్టీఆర్ 30కి డేట్స్ ఇస్తుందా..?
ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి ఇండస్ట్రీ వర్గాలలో.. అభిమానుల్లో హీరోయిన్ గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో బాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న కియారా అద్వానీ నటించబోతుందన్న మాట వినిపిస్తోంది. కియారా అద్వానీకి దర్శకుడు కొరటాల శివతో మంచి అనుబంధం ఉంది. మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాతో కియారాని కొరటాల శివ టాలీవుడ్ కి పరిచయం చేశాడు. అందుకే కొరటాల ..ఎన్టీఆర్ 30కి కియారాని పరిశీలిస్తున్నారట. మరి బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కియారా ఎన్టీఆర్ 30కి డేట్స్ ఇస్తుందా అన్నది చూడాలి.