Intinti Gruhalakshmi : తులసిపై కేసు పెట్టబోతున్న నందు.. కారణం అదేనా.. తులసికి ఈ విషయం తెలిసి ఏం చేస్తుంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi : తులసిపై కేసు పెట్టబోతున్న నందు.. కారణం అదేనా.. తులసికి ఈ విషయం తెలిసి ఏం చేస్తుంది?

 Authored By gatla | The Telugu News | Updated on :5 June 2022,9:30 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 6 జూన్ 2022, సోమవారం ఎపిసోడ్ 651 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు వెళ్లమని ఆర్డర్ వేస్తేనే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చాను. మీ మాటకు విలువ ఇచ్చినందుకు మీరు నాకు ఇచ్చే విలువ ఇదేనా ఆంటి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది అంకిత. దివ్య కూడా వదినను ఏమీ అనవద్దు అని తులసికి సలహా ఇస్తుంది. కానీ.. తులసి మాత్రం మనసులో వేరే అనుకుంటుంది. నన్ను క్షమించు అంకిత. నీ జీవితం నా జీవితంలా కాకూడదు అని నా బాధ. నువ్వు ఈ ఇంటికి వస్తే.. నీ భర్తతో నీ కాపురం చెడిపోయే అవకాశం ఉంది. అందుకే నా వైపు నుంచి ఈ నిర్ణయం తీసుకున్నాను అని అనుకుంటుంది తులసి.

tulasi gives advice to abhi about the life in intinti gruhalakshmi

tulasi gives advice to abhi about the life in intinti gruhalakshmi

మరోవైపు తులసి రోడ్డు మీద వెళ్తుండగా లాస్య ఆపి తనతో మాట్లాడుతుంది. నీ పెద్ద కొడుకు, కోడలు నీకు శాశ్వతంగా దూరం అయినట్టే ఇక అని అంటుంది లాస్య. గెలిచింది నువ్వా నేనా అంటుంది లాస్య. అంకితను నేను హెచ్చరించడం నువ్వు నీ ఖాతాలో వేసుకున్నావా.. అంకితను మా గడప తొక్కొద్దు అనడానికి మా కారణాలు మాకున్నాయి.. అంటుంది తులసి. నేను తలుచుకుంటే ఈ క్షణమే నా కొడుకును, కోడలును నా ఇంటికి తెచ్చుకోగలను. కాస్త మీ వంకర బుద్ధులు మార్చుకోండి. మీవి మీ ఆయనవి అంటుంది తులసి. 2 లక్షలు ఖర్చు పెట్టి కోడలు పుట్టిన రోజు జరిపారంటే.. దాని వెనుక ఎలాంటి వంకర ఆలోచనలు లేవంటావా అంటుంది తులసి. పార్టీలో అభిని పూసుకొని తిరగడం వెనుక ఎలాంటి కారణం లేదంటావా. తన చేత్తో ఎప్పుడూ కేకు కూడా కొనిపెట్టని మీ వారు.. తన కోడలు కోసం ఆర్డర్ పెట్టి మరీ తెప్పించారు. ఇవి వంకర ఆలోచనలు కావా అంటుంది తులసి.

Intinti Gruhalakshmi : అంకితను మీ దారిలోకి తెచ్చుకోవడానికే ఇదంతా అని లాస్యతో అన్న తులసి

అంకితకు ఆస్తి కలిసి వస్తుందని నాకు తెలుసా ముందు మీకు తెలుసా? అంకితను మీ దారిలోకి తెచ్చుకోవడానికే ఇదంతా మీరు చేయడం లేదా.. అని లాస్యతో అంటుంది. దీంతో వావ్ సూపర్ తులసి అంటుంది. నీ తెలివికి హ్యాట్సాఫ్. మా ప్లాన్ ఏంటో నీకు తెలిసిపోయింది. అయితే మాత్రం ఏం చేస్తావు అంటుంది లాస్య.

నీ భర్తనే నేను నా వశం చేసుకున్నాను. నువ్వేం చేశావు. మీ వాళ్లందరూ ఒక్కొక్కరు నీకు దూరం అవుతారు. నీ సామ్రాజ్యం కూలిపోతుంది. ఒంటరి పక్షిలా మిగిలిపోతావు. జరిగింది తలుచుకొని ఒంటరి పక్షిలా మిగిలిపోతావు తప్పితే ఇంకేం చేయలేవు అని అంటుంది లాస్య.

ఈసారి ఆ తప్పు జరగనివ్వను లాస్య రాసిపెట్టుకో. అప్పుడు నా భర్త మోసం కూడా ఉంది కాబట్టి నేను ఏం అనలేదు. కానీ.. ఇప్పుడు అలా కాదు లాస్య. తనకు నష్టం జరిగితే తల్లి సహిస్తుంది కానీ..  తన పిల్లలకు ఏదైనా జరిగితే ఆ తల్లి విరుచుకుపడుతుంది. తన పిల్లలను కాపాడుకుంటుంది. అన్యాయం చేయాలనుకున్న వాళ్ల రక్తం కళ్ల చూస్తుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి.

మరోవైపు తులసి కూడా పార్టీలో మాట్లాడకపోయేసరికి.. బాధపడుతూ కూర్చుంటాడు ప్రేమ్. ఎలాగైనా ఏదో ఒకటి సాధించాలి అని శృతితో అంటాడు. ఒక కొత్త ఆల్బమ్ చేస్తే బాగా పేరొస్తుంది. ఆ తర్వాత అవకాశాలు వస్తాయి కానీ.. దాని కోసం 5 లక్షల రూపాయలు కావాలి అంటాడు ప్రేమ్.

మరోవైపు అభితో మాట్లాడేందుకు ఓ కేఫ్ కు రమ్మంటుంది తులసి. జీవితం అంటే ఏంటో అభికి చెబుతుంది తులసి. తన కోసం లడ్డులు తీసుకొస్తుంది తులసి. ఇంతలో గాయత్రి.. అభికి ఫోన్ చేస్తే.. నేను బిజీగా ఉన్నా తర్వాత చేస్తా అంటాడు అభి.

మరోవైపు నందు, లాస్య ఇద్దరూ తులసి ఇంటికి వెళ్లి తులసితో గొడవ పెట్టుకుంటారు. ఇంట్లో ప్రతి వాళ్లను నీ గుప్పెట్లో పెట్టుకొని ఆడిద్దామనుకుంటున్నావా అని అడుగుతాడు నందు. నా పిల్లలను నాకు దూరం చేద్దామనుకుంటున్నావా అని ప్రశ్నిస్తాడు.

నాకు, నా పిల్లలకు మధ్య ఎవరు అడ్డుగోడగా నిలబడ్డా ఊరుకోను అని అంటాడు నందు. నా పిల్లలను దూరం చేస్తోందని నీ మీద కేసు పెట్టడానికి కూడా వెనకాడను అని అంటాడు నందు. దీంతో మీరు చేయాల్సింది మీరు చేయండి.. నేను చేయాల్సింది నేను చేస్తాను అంటుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది