JR NTR : ఎన్టీఆర్ నన్ను వదిలించుకోవాలని అనుకున్నాడంటూ ఆసక్తికర కామెంట్స్ చేసిన వివి. వినాయక్
JR NTR : ఇటీవలి కాలంలో హీరోలు, దర్శకులు మీడియా ముఖంగా పలు విషయాలపై ఆసక్తికర కామెంట్స్ చేస్తూ హాట్ టాపిక్ అవుతున్నారు. గతంలో విషయాల గురించి ఇప్పుడు ప్రస్తావిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా వినాయక్ .. ఎన్టీఆర్‌కి సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ చేస్తూ వార్తలలోకి ఎక్కాడు. యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , స్టార్ డైరెక్టర్ వివి. వినాయక్‌ది సూపర్ హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఆది ,సాంబ , అదుర్స్ మూడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మరోసారి ఎన్టీఆర్ వినాయక్‌కు అదుర్స్ 2 సినిమాతో ఛాన్స్ ఇవ్వాలని కూడా ఉన్నాడు.
అయితే ఎన్టీఆర్ కెరీర్ మొదట్లో.. వినాయక్ ముందుగా ఎన్టీఆర్‌కు ఓ లవ్‌స్టోరీ చెప్పాడట. అది ఎన్టీఆర్‌కు నచ్చింది. కాని ఎన్టీఆర్‌కు సన్నిహితుడిగా ఉన్న కొడాలి నాని లవ్‌స్టోరీలు వంటివి చేయవద్దు అని ఎన్టీఆర్‌కు చెప్పడంతో ఎన్టీఆర్ వినాయక్‌కు ఏం చెప్పలేకుండా కాస్త తటపటాయిస్తున్నాడట. అయితే వినాయక్ ఇక్కడే మరో ఆవేదన కూడా వెళ్లబుచ్చారు. ఇండస్ట్రీలో రాఘవేంద్రరావు గారి శిష్యులం అని చెపితే ఎంతటి హీరో అయినా వెంటనే కథ వింటాడని.. సాగర్ గారి శిష్యులం అంటే ఎవరికి అయినా అంత త్వరగా ఛాన్స్ ఇవ్వరని.. ఈ వివక్ష ఉందని చెప్పారు. వాస్తవానికి ముందు కథ చెపుతానని అన్నా కూడా ఎన్టీఆర్ ఎలా వదిలించుకుందామా ?

V. V. Vinayak crazy comments on Jr ntr
JR NTR : వినాయక్ క్రేజీ కామెంట్స్..
అన్న ఆలోచనతోనే ఓ సారి కథ విని పంపేద్దామనే ఉన్నాడని వినాయక్ చెప్పాడు. అనుకున్నట్టుగానే కొడాలి నాని లవ్‌స్టోరీ వద్దని చెప్పడంతో వినాయక్ ఆశలు అవిరైపోయాయి. వెంటనే వినాయక్ బాబు ఇంకొక్క కథ చెపుతాను.. నచ్చకపోతే చెప్పేయండి.. ఇబ్బంది లేదని అన్నారట. కేవలం రెండు రోజుల్లోనే ఆది కథ రాసుకుని వినాయక్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లాడట.అది నచ్చడంతో నెరేషన్ అంతా విని సినిమా చేస్తున్నాం అని అన్నారట. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆది సినిమా సూపర్ హిట్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్‌కు తక్కువ వయస్సులోనే స్టార్ డమ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది.