Vadinamma 19 Oct Today Episode : సీతపై సిరి తల్లి సీరియస్.. భరత్ ను ఇన్ని రోజులు చదవనీయకుండా పనిలో పెట్టింది నువ్వేనంటూ వార్నింగ్
Vadinamma 19 Oct Today Episode : వదినమ్మ సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. 19 అక్టోబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. భరత్.. ఇంటర్ జిల్లా ఫస్ట్ రావడంతో మీడియా వాళ్లు భరత్ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అందరరూ భరత్ ను పొగడ్తల్లో ముంచెత్తుతారు. సిరి డిగ్రీ చదివినా కూడా భరత్ ను పెళ్లి చేసుకోవడం భరత్ అదృష్టం అంటుంది సీత. చదువు లేకపోయినా భరత్ ను ఎప్పుడూ సిరి తక్కువగా చూడలేదు. ఇంట్లో జరిగిన ఓ సంఘటన వల్ల చదువు విలువ ఏంటో భరత్ తెలుసుకున్నాడు.. అంటూ ఇలా అందరూ సిరిని పొగడ్తల్లో ముంచెత్తుతారు.
మా పెద్దన్నయ్య తన చిన్నప్పుడు మా అందరి కోసం నెత్తి మీద సరుకులు మోసి వీధివీధి తిరిగి మా అందరికీ కడుపులు నింపేవాడు. ఒక్కో మెట్టు ఎదుగుతూ బండి మీద వ్యాపారం చేసి మా అందరినీ పోషించేవాడు. అందుకే మా అన్నయ్యకు తోడుగా ఉండాలని ఆ వయసులోనే నిర్ణయం తీసుకున్నాను. చదువు వదిలేసి మా అన్నయ్య చేయి పట్టుకున్నాను. మా వదినమ్మ మాకు అమ్మ. మా అందరినీ బిడ్డల్లా చూసుకుంది. మా కుటుంబానికే అండగా ఉంది.. అని భరత్ చెబుతాడు.
మా తమ్ముళ్లు అంటేనే మాకు పంచప్రాణాలు. వాడి సాదించిన విజయంతో మాకు పేరు తెచ్చిపెట్టాడు. అని అంటుంది సీత. భర్తకు చదువు లేదని బాధపడకుండా.. వాడికి చదువును నేర్పించి గొప్ప పని చేసింది సిరి. చదువుకు వయసుతో సంబంధం లేదు అని చెప్పి అందరూ భరత్ ను పొగడ్తల్లో ముంచెత్తుతారు. ఇక.. మీడియా వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు.
ఇంతలో సీత.. తన అన్నయ్యకు ఫోన్ చేసి భరత్ మనందరం గర్వపడేలా చేశాడు అని చెబుతాడడు. నైట్ కాలేజీలో చదివి.. ఇంటర్ ఎగ్జామ్స్ రాసి జిల్లాలో ఫస్ట్ వచ్చాడు. రిజల్ట్స్ వచ్చాకనే వాడి చదువు విషయం తెలిసిందని చెబుతుంది సీత. సాయంత్రం 4 గంటలకు టీవీలో ఇంటర్వ్యూ వస్తుంది. అందూ చూడండి అని చెప్పి సీత ఫోన్ పెట్టేస్తుంది.
Vadinamma 19 Oct Today Episode : భరత్ ను మెచ్చుకున్న ఊరివాళ్లు
ఇంతలో సిరి.. తన తల్లికి ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నవే ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు ఏంది.. అని అడుగుతుంది సిరి. నీకు నీ బండోడే ముఖ్యం కదా.. మేం కాదు కదా అంటుంది తన తల్లి. ఇప్పుడు మాట్లాడటం కాదు.. సాయంత్రం 4 గంటలకు టీవీ చూసి అప్పుడు మాట్లాడండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సిరి.
సాయంత్రం 4 గంటలకు ఇంటర్వ్యూ వస్తుంది. అందరూ చూస్తారు. ఊరివాళ్లు అందరూ వచ్చి భరత్ ను మెచ్చుకుంటారు. భరత్ బాగా చదువుకున్నాడు కాబట్టి.. చదువుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోమని సీత చెబుతుంది. మంచి ఉద్యోగం చూసుకొని డిగ్రీ పూర్తి చేయమని చెబుతుంది. నేను చదువుకున్నా కూడా నేను షాపులో పనిచేస్తా అంటాడు భరత్. భరత్ కు ఇన్ని రోజులు చదువు ఎందుకు చెప్పించలేదని సిరి తల్లి కూడా సీతను తిడుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.