మగాళ్లు జాగ్రత్త.. తొందరపడి ఈ ఫుడ్ తిన్నారంటే.. ఇక మీ పని అంతే..!
ఆహారం బాగా తీసుకోవాలి. అప్పుడే హెల్దీగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటాం. అదే ఆహారాన్ని తక్కువగా తీసుకుంటే.. ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం అందరికీ తెలుసు కానీ.. ఏ ఆహారాన్ని తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి.. అనే విషయమే చాలామందికి తెలియదు. ఏది తింటే మేలు.. ఏది తినకపోతే మేలు.. అనేది చాలామంది తెలుసుకోవాల్సి ఉంటుంది. లేదంటే లేనిపోని సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొందరు ఏది పడితే అది తినేస్తారు. దాని వల్ల లేనిపోని ఆరోగ్య సమస్యలు కోరి తెచ్చుకుంటారు. ముఖ్యంగా పురుషులు.. కొన్ని ఆహారాలు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే.. చాలా సమస్యలను కోరి తెచ్చుకోవాల్సిందే.ఇంతకీ ఏ ఫుడ్ తింటే సమస్యలు వస్తాయి? అంటారా? అదేనండి.. ఫాస్ట్ ఫుడ్. అదంటే చాలామందికి ఇష్టం. ఫాస్ట్ ఫుడ్ లేకుండా ఉండలేరు. ఈరోజుల్లో ఫాస్ట్ ఫుడ్ తినడం ఈ జనరేషన్ కు ఎక్కువయింది. పిజ్జాలు, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రై, చికెన్ ఫ్రై, చికెన్ 65, చికెన్ టిక్కా.. ఇలా పలు రకాల ఫాస్ట్ ఫుడ్ ను తింటున్నారు. దీని వల్ల పురుషులకు అయితే ఎక్కువ సమస్యలు వస్తాయట.
దానిపై ప్రభావం చూపే ఫాస్ట్ ఫుడ్
పురుషులకు అనేది చాలా ముఖ్యం. అది లేకపోతే చాలా సమస్యలు వస్తాయి. అయితే.. ఫాస్ట్ ఫుడ్ ను అదేపనిగా తినేవాళ్లలో ఆ సమస్యలు వస్తాయట. పురుషత్వం తగ్గుతుందట. ఆ కౌంట్ కూడా తగ్గుతుందట. వృషణాల పరిమాణం కూడా రోజురోజుకూ కుంచించుకుపోతుందట. అతిగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ తినేవారిలో పైన చెప్పుకున్న సమస్యలను హార్వర్డ్ యూనివర్సిటీ స్టడీలో తేల్చారట.ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్ తో పాటు.. రెడ్ మీట్, బ్రెడ్, స్వీట్స్ కూడా ఎక్కువగా తింటే ఈ సమస్యలు వస్తాయట. పెళ్లి అయి పిల్లలు ఉన్నవాళ్లకు సమస్య లేదు కానీ.. యువకులకు, పెళ్లి కావాల్సిన వాళ్లు మాత్రం జాగ్రత్త వహించాలని లేదంటే పిల్లలు కనే సామర్థ్యాన్ని కోల్పోతారని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వీళైనంత ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని వాళ్లు హెచ్చరిస్తున్నారు.