Rajendra prasad : భార్య గురించి చెబుతూ ఏమోషనల్ అయిన నటకీరిటీ రాజేంద్ర ప్రసాద్…!
Rajendra prasad : తెలుగు సినీ పరిశ్రమలో నట కీరిటి రాజేంద్ర ప్రసాద్ సినీ కెరియర్ గురించి తెలియని వారుండరు. దాదాపు పాతిక సంవత్సరాల పాటు తెలుగు ప్రేక్షకులను కడపుబ్బా నవ్వించి మంచి గుర్తింపు దక్కించుకున్నారాయన. కేవలం కామెడీతోనే కాకుండా మంచి మంచి పాత్రల్లో అద్భుతంగా నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. హీరోగా అవకాశాలు కనుమరుగై పోయినా… సహాయనటుడిగా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలను సొంతం చేసుకుంటూ ఇప్పటికీ తన అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. అయితే ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే రాజేంద్ర ప్రసాద్ ఒకప్పుడు ఎన్నో బాధలను అనుంభవించారట.
ఆ సమయంలో తన భార్య తన పక్కన లేకపోతే తాను ఏమై ఉండేవాడినో అని ఇప్పటికీ బాధ పడుతూ ఉంటారంట.ప్రతి విజయం వెనుక ఓ ఆడది ఉన్నట్లే తన విజయం వెనక కూడా తన భార్య విజయ చాముండేశ్వరి ఉందని రాజేంద్రప్రసాద్ చెబుతూ ఉంటారు. తాను చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో… అవకాశాల కోసం ఎన్నో అవమానాలు పడినట్లు ఆయన గుర్తు చేసుకున్నారు. అయితే తన భార్య సపోర్ట్ వల్లే తాను ఈరోజు నటకిరీటి అనే బిరుదును సొంతం చేసుకున్నాట్లు వివరించారు. తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు తనపై ఎన్నో రూమర్లు వచ్చినట్లు తెలిపారు. అయితే తన భార్య ఏనాడు వాటిని పట్టించుకోలేదని చెప్పుకొచ్చారు.

vetaran hero Rajendra prasad felt emotional while saying about her wife
Rajendra prasad : నా భార్య సపోర్ట్ వల్లే నేనిలా ఉన్నాను..:
రాజేంద్రప్రసాద్ భార్య గురించి సినీ ఇండస్ట్రీలో చాలా మందికి తెలియదు. ఆమె ఇంతవరకూ బయట ఏ ఫంక్షన్ కి రాకపోవడమే అందుకు కారణం. ఈ నటకీరిటి భార్య విజయ చాముండేశ్వరి ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారట. ఆమెకు సినిమాలపై పెద్దగా ఆసక్తి ఉండదట. అందుకే భర్తతో పాటు బయట ఏ సినిమా ఫంక్షన్ లకు కూడా ఆమె హాజరు కాదని సమాచారం. అయితే ఇటీవల రాజేంద్ర ప్రసాద్ కుమారుడి వివాహం జరిగింది. స్నేహం సినిమాతో తెరపైకి ఆరంగేట్రం చేసిన రాజేంద్ర ప్రసాద్.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు.