Vidaamuyarchi Pattudala Box Office collections : విదాముయార్చి సినిమా ఎలా ఉంది.. తొలి రోజు కలెక్షన్స్ పరిస్థితి ఏంటి?
Vidaamuyarchi Pattudala Box Office collections : అగ్ర కథానాయకుడు అజిత్ కుమార్ Ajith , లైకా ప్రొడక్షన్స్ కాంబినేషన్‌లో రూపొందిన భారీ మూవీ ‘విడాముయర్చి’. ఈ క్రేజీ సినిమాకు మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు. ‘విడాముయర్చి’ మూవీ ప్రారంభం నుంచి కోలివుడ్ సహా అందరి దృష్టిని ఆకర్శిస్తోంది. ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నమగిళ్ కు ఆకట్టుకునే ఎంటర్ టైన్మెంట్ చిత్రాలతోపాటు విలక్షణమైన చిత్రాలు తీస్తాడు అనే పేరు ఉంది.ఈ సినిమాను తెలుగులో పట్టుదల టైటిల్‌తో రిలీజ్ చేశారు.
![Vidaamuyarchi Pattudala Box Office collections విదాముయార్చి సినిమా ఎలా ఉంది తొలి రోజు కలెక్షన్స్ పరిస్థితి ఏంటి](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Vidaamuyarchi-Pattudala-Box-Office-collections.jpg)
Vidaamuyarchi Pattudala Box Office collections : విదాముయార్చి సినిమా ఎలా ఉంది.. తొలి రోజు కలెక్షన్స్ పరిస్థితి ఏంటి?
Vidaamuyarchi Pattudala Box Office collections భారీ కలెక్షన్స్..
ఈ సినిమాకు ఓవర్సీస్‌లో రికార్డు ఓపెనింగ్స్ నమోదు అయ్యాయి. ఇటీవల ప్రారంభమైన అడ్వాన్స్ బుకింగ్‌కు అనూహ్యమైన రెస్సాన్స్ లభించింది.అమెరికా, కెనడాలో కలిపి 500K, ఆస్ట్రేలియాలో 75k ఆస్ట్రేలియా డాలర్లు,న్యూజిలాండ్‌లో 20 న్యూజిలాండ్ డాలర్లు,గల్ఫ్‌లో 200 డాలర్లు,మలేషియాలో 750 మలేషియన్ డాలర్లు, సింగపూర్‌లో 125 డాలర్లు, శ్రీలంకలో 1 కోటి రూపాయలు, యూకే,యూరప్‌లో 150 పౌండ్లు వసూలు చేసింది.
ఓవరాల్‌గా ఈ సినిమా 1 మిలియన్ డాలర్లు అంటే సుమారుగా 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది.తమిళనాడులో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు నమోదు అయ్యాయి. కన్నడలో సినిమాకు భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. కేరళలో ఓ మోస్తారు కలెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 17 కోట్ల రూపాయలు, ఇతర రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇదిలా ఉండగా, విదాముయార్చి సినిమా అజిత్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించే చిత్రంగా రికార్డు క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.