Ajith | ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 29 శస్త్ర చికిత్సలు జరిగాయి.. అజిత్ కామెంట్స్
Ajith | తమిళ సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్న హీరోల్లో అజిత్ కుమార్ ఒకరు. ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ప్రవేశించి, తన ప్రతిభతో కోట్లాది మంది అభిమానులను సంపాదించిన అజిత్ తాజాగా తన కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడారు.
#image_title
నా భార్య సపోర్ట్ ఎంతో..
హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అజిత్ అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “నా కెరీర్ ప్రారంభ దశలో నేను తమిళం సరిగ్గా మాట్లాడలేకపోయాను. నా యాక్సెంట్ భిన్నంగా ఉండేది. చాలా మంది నా పేరు మార్చమని సలహా ఇచ్చారు. కానీ నాకు నా పేరు పట్ల గౌరవం ఉంది. అదే పేరుతో నేను గుర్తింపు పొందాలనుకున్నాను” అని అజిత్ తెలిపారు.
సినిమా ప్రారంభ దశలోనే రేసింగ్‌పై తనకు ఆసక్తి ఎక్కువగా ఉందని, 19 ఏళ్ల వయసులోనే ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టానని చెప్పారు. “నిరంతర కృషి, సరైన టీమ్, మరియు మంచి దర్శకులు, నిర్మాతల మద్దతుతోనే నేను ఈ స్థాయికి చేరుకున్నాను. వాళ్లందరినుంచీ నేర్చుకున్న అనుభవమే నాకు బలం” అని అన్నారు. అజిత్ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ, “నా కెరీర్‌లో ప్రమాదాల వల్ల నాకు ఇప్పటివరకు 29 శస్త్రచికిత్సలు జరిగాయి. ఆ కష్టకాలంలో కూడా నేను వెనక్కి తగ్గలేదు” అని చెప్పారు.