Ramya Krishnan : బాబోయ్ నిజంగా లైగర్ మదర్ అంత పారితోషికం తీసుకుందా
Ramya Krishnan : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కి తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లైగర్ సినిమా సోషల్ మీడియాలో ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా ఉంది. సినిమాకు సంబంధించిన వసూళ్ల విషయం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సమయంలోనే సినిమా కోసం వర్క్ చేసిన నటీనటులు తీసుకున్న పారితోషకం గురించి కూడా ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ దాదాపుగా 15 కోట్ల పారితోషికం తీసుకొని లాభాల్లో వాటాను తీసుకోవాలని భావించాడు. కానీ లాభాల్లో వాటా సంగతి దేవుడెరుగు ఇప్పుడు ఆ రూ. 15 కోట్ల పారితోషికం అయినా ఆయనకు దక్కిందా అనేది పెద్ద ప్రశ్నగా మారింది.
విజయ్ దేవరకొండ పారితోషికం విషయం పక్కనపెడితే ఇతర నటీనటుల పారితోషకాలు భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మైక్ టైసన్ నటించిన విషయం తెలిసిందే, ఆయనకు అత్యధిక పారితోషికమును చిత్ర యూనిట్ సభ్యులు ముట్ట చెప్పారని సమాచారం అందుతుంది. ఇక హీరోయిన్ అనన్య పాండేకు రూ. మూడు కోట్ల వరకు పారితోషికం ఇచ్చారట. ఆమె బాలీవుడ్ కి కొత్త, టాలీవుడ్ కి మరీ కొత్త. అయినా కూడా మూడు కోట్ల పారితోషికం ఎలా ఇచ్చారంటూ సినీ వర్గాల వారు మరియు విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక సినిమాలో హీరో పాత్రకు తల్లిగా నటించిన రమ్యకృష్ణకు ఏకంగా కోటి రూపాయల పారితోషికములు ఇచ్చారంటూ సమాచారం అందుతుంది.ఎక్కువ డేట్లు కేటాయించిన కారణంగా ఆమెకు కోటి రూపాయల పారితోషికం ఇచ్చారని సమాచారం అందుతుంది.
ఎంతైనా రమ్యకృష్ణకు కోటి రూపాయల పారితోషికం అంటే మరీ ఎక్కువ గురు అంటూ నేటిజన్లు చెవులు కోరుకొంటున్నారు. ఇబ్బడిముబ్బడిగా పారితోషికాలు ఇవ్వడం ద్వారా బడ్జెట్ ని అమాంతం పెంచేసి.. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలు బయ్యర్ల నెత్తిన ఆ నష్టం నీ వేస్తున్నారంటూ సినీ వర్గాల వారు మరియు పంపిణీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లైగర్ సినిమా దాదాపుగా 90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ని చేసింది. ఇప్పుడు సినిమా లాంగ్ రన్ లో కనీసం రూ. 30 కోట్ల వసూలను కూడా తెచ్చిపెడుతుంది అనే నమ్మకం లేదు. దాంతో ఎంత నష్టమో మీరే అర్థం చేసుకోవచ్చు. ఇంత నష్టం సాధించిన సినిమా యొక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి కోటి రూపాయల పారితోషికం అంటే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఊహించుకుంటే మీకే అర్థమవుతుంది.