Samantha : “సమంతని ప్రేమిస్తున్నా” నాగ చైతన్య ముందరే ధైర్యంగా చెప్పేసిన విజయ్ దేవరకొండ.. ఇండస్ట్రీలో ప్రకంపనలు

Advertisement

Samantha : రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలుసు కదా. ఆయన రూటే సపరేటు. ఒక్కసారిగా ఓవర్ నైట్ లో క్రేజ్ సంపాదించుకున్న హీరో. కానీ.. ప్రస్తుతం ఆయన సినీ కెరీర్ ఏమాత్రం బాగోలేదు. లైగర్ డిజాస్టర్ అవడంతో రౌడీ హీరో కాస్త కుంగిపోయిన మాట వాస్తవమే కానీ.. తనకు వచ్చే సినిమా ఆఫర్ల విషయంలో మాత్రం ఎలాంటి సమస్య లేదు. ప్రస్తుతం ఆయన చేతుల్లో చాలా సినిమాలు ఉన్నాయి. లైగర్ ఫ్లాప్ ను మరిచిపోయి ప్రస్తుతం తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. కట్ చేస్తే.. తాజాగా సమంత నటించిన యశోద సినిమా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే.

ఈ సినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్స్ జరుపుకుంటోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఐదు భాషల్లో విడుదల చేశారు. తెలుగు ట్రైలర్ ను విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. అంతే కాదు.. ఆయన ఓ ట్వీట్ కూడా సినిమాకు సంబంధించి చేశాడు. యశోద సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన అనంతరం ట్వీట్ చేసిన విజయ్ దేవరకొండ.. తాను కాలేజీ రోజుల్లో చదువుకునే సమయంలో సమంతను తొలిసారి వెండి తెరపై చూసి ప్రేమలో పడిపోయాడట. ఆ విషయాన్ని తాజాగా బయటపెట్టాడు రౌడీ హీరో. ఎప్పుడైతే సమంతను వెండి తెర మీద చూశానో..

Advertisement
vijay deverakonda reveals about his first love
vijay deverakonda reveals about his first love

Samantha : సామ్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్న రౌడీ హీరో

ఆ క్షణమే ప్రేమలో పడిపోయా అంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు. ఇప్పటికీ నేను ఆమెనే ఆరాధిస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు రౌడీ హీరో. దీంతో ఒక్కసారిగా.. సమంత, విజయ్ దేవరకొండ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. మరోవైపు ఇద్దరూ కలిసి మహానటి సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత ఖుషీ అనే సినిమాలో నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఆ సినిమా రాబోతుంది. సమంత, విజయ్ దేవరకొండ హీరోహీరోయిన్లుగా ఆ సినిమాలో నటిస్తున్నారు. చూద్దాం మరి వీళ్లిద్దరి రొమాన్స్ ఈ సినిమాలో ఎలా పండుతుందో?

Advertisement
Advertisement