Vishal – Dhansika | నిశ్చితార్థం చేసుకున్న విశాల్‌, ధ‌న్సిక.. వారిద్ద‌రి ప్రేమ‌, ఎప్పుడు ఎలా మొద‌లైంది? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vishal – Dhansika | నిశ్చితార్థం చేసుకున్న విశాల్‌, ధ‌న్సిక.. వారిద్ద‌రి ప్రేమ‌, ఎప్పుడు ఎలా మొద‌లైంది?

 Authored By sandeep | The Telugu News | Updated on :30 August 2025,12:00 pm

Vishal – Dhansika | తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చాలా ఉన్నాయి. అజిత్-శాలిని, సూర్య-జ్యోతిక, నయనతార-విగ్నేష్ శివన్ వంటి వారు సినిమాల ద్వారా పరిచయమై, ప్రేమలో పడినవారు. కానీ తాజాగా పెళ్లి చేసుకోబోతున్న విశాల్ మరియు సాయి ధన్సిక మాత్రం అలాంటి జంట కాదంటున్నారు సినీ వర్గాలు. వీరిద్దరూ ఒక్క సినిమాలోనూ కలిసి నటించకపోయినా, మనసులు మాత్రం కలిశాయి. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ పూర్తవ్వడంతో, వీరి రిలేషన్ అధికారికంగా వెలుగులోకి వచ్చింది.

#image_title

వీరిమధ్య ప్రేమకు బీజం పడింది 2017లో జరిగిన ఓ వివాదంతో. ‘విజితిరు’ సినిమాకు సంబంధించిన ఓ ప్రెస్‌మీట్‌లో సాయి ధన్సిక స్టేజీపై మాట్లాడుతూ టీమ్‌ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలుపగా, అప్పట్లో ఆ చిత్రంలో నటించిన టీ. రాజేందర్ పేరును అనుకోకుండా మరిచింది. దీంతో రాజేందర్ తీవ్రంగా స్పందించి ఆమెపై విమర్శలు గుప్పించాడు. “సీనియర్లను గౌరవించడం తెలియదా?” అంటూ బహిరంగంగా ఆమెను హేళన చేశాడు.

ధన్సిక తన తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పినా, రాజేందర్ సాఫ్ట్‌గా తీసుకోలేదు. ఆమెపై “రజనీ సినిమాలో నటించిన తర్వాత గర్వం పెరిగింది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఘటన తర్వాత ఆమెకి స‌పోర్ట్‌గా ఉన్నాడు విశాల్. అప్పుడు తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా ఉన్న విశాల్, రాజేందర్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. “తనకంటే చిన్నవాళ్లను ప్రోత్సహించకుండా, బహిరంగంగా తిట్టడం సరైంది కాదు” అంటూ ధన్సికకు మద్దతుగా నిలిచాడు. అప్పటికే వారిద్దరి మధ్య కొంత పరిచయం ఉన్నప్పటికీ, ఈ సంఘటన తర్వాత వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం బలపడింది. అదే ప్రేమగా మారింది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది