Vishwak Sen : రిపోర్టర్స్ అడిగిన ప్రశ్నలకు గట్టిగా ఇచ్చిపడేసిన విశ్వక్సేన్ ..!
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్సేన్ తాజాగా నటిస్తున్న సినిమా ‘ గామి ‘. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పై కార్తీక్ శబరీష్ సినిమాని నిర్మించగా వి సెల్యులాయిడ్ సమర్పిస్తుంది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిప్స్ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో ‘ గామి ‘ విడుదల తేదీ ప్రకటించారు. విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి […]
Vishwak Sen : మాస్ కా దాస్ విశ్వక్సేన్ తాజాగా నటిస్తున్న సినిమా ‘ గామి ‘. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్ పై కార్తీక్ శబరీష్ సినిమాని నిర్మించగా వి సెల్యులాయిడ్ సమర్పిస్తుంది. విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లిప్స్ మంచి స్పందనను రాబట్టుకున్నాయి. తాజాగా మేకర్స్ హైదరాబాదులో జరిగిన మీడియా సమావేశంలో ‘ గామి ‘ విడుదల తేదీ ప్రకటించారు. విశ్వక్సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల కావాల్సిన తేదీని ఈ సినిమాకు కేటాయించినట్లుగా తెలిపారు. మార్చి 8న గామి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదల తేదీ ప్రకటన అనంతరం చిత్ర యూనిట్ కాసేపు మీడియాతో ముచ్చటించారు.
ముందుగా సినిమా గురించి విశ్వక్సేన్ మాట్లాడుతూ వారణాసిలో గామి షూటింగ్ చేస్తున్నప్పుడు ఫోన్ లో ఫలక్ నామా దాస్ టీజర్ ఎడిట్ చేస్తుండేవాడిని. దర్శకుడు విద్యాధర్ గామి కోసం చాలా రీసెర్చ్ చేశాడు. సినిమాలోని ప్రతి ఎలిమెంట్ గురించి చాలా లోతుగా రాసుకున్నాడు. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడే సమయం పడుతుందని తెలుసు. దాదాపు నాలుగున్నర ఏళ్ల పాటు సినిమా చేశాం. ఇంత సమయం వచ్చాం కాబట్టే మంచి సీజీని రాబట్టుకున్నాం. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అయితే నిజంగానే కుంభమేళాలో ఒకరిద్దరూ నేను అఘోరా అనుకోని ధర్మం చేశారు. వారణాసిలో చలికి వణుకుతూ ఓ మూల కూర్చున్నప్పుడు ఓ ముసలామె భోజనం పెట్టి టీ ఇచ్చింది. సినిమా ట్రైలర్ చూశాను. మైండ్ బ్లోయింగ్ అనిపించింది.
ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వస్తుందని నమ్మకం ఉంది. గామి మార్చి 8న విడుదలవుతుంది. కచ్చితంగా అందరిని అలరిస్తుంది అని తెలిపారు. అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ గామి సినిమా కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు..ఈ సినిమా వెనక ఏదైనా స్ఫూర్తి నింపే కథ ఉందా.. మీ డైలాగ్స్ కి చాలామంది అభిమానులు ఉన్నారు.. ఇందులో ఎంజాయ్ చేసే డైలాగ్స్ ఉంటాయ అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు విశ్వక్సేన్ మాట్లాడుతూ.. ఈ మధ్య సైలెంట్ గా ఉంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని అన్నారు. దీంతో సలార్ ను ఏమైనా స్ఫూర్తిగా తీసుకున్నారా అని అడగగా నాలుగేళ్ల కిందటే స్ఫూర్తి పొందాం. ఈ మధ్య సినిమాల కలెక్షన్లు చూశాక ఇంకా నా డైలాగ్స్ తగ్గించమని చెప్పాను అని విశ్వక్సేన్ అన్నారు.