Bigg Boss 5 Telugu : ఎన్ని జన్మలెత్తినా కూడా రవి గుంట నక్కే.. అందరికీ పేర్లు పెట్టిన సన్నీ
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షోతో యాంకర్ రవి ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. అతని చేష్టలు, మాటలు అన్నీ కూడా నెగెటివ్ ఇమేజ్‌ను తీసుకొస్తున్నాయ్. ఇక అతను ఆడే ఆట విధానం, అందరినీ ప్రభావితం చేయడం, ఒకరి దగ్గరికి వెళ్లి ఇంకొకరికి చెప్పడం, అక్కడివి ఇక్కడ.. ఇక్కడివి అక్కడ అంటూ మాటలు మార్చేస్తున్నాడు. అమ్మ తోడు వేయడం, అబద్దాలు ఆడటంతో రవి ఇమేజ్ పూర్తిగా బ్యాడ్ అయింది. ఇక నటరాజ్ మాస్టర్ పెట్టిన పేరుకు రవి సార్థకం చేసుకుంటున్నాడు.
గుంటనక్క అంటూ రవి గురించి నటరాజ్ మాస్టర్ పెట్టిన పేరు, చేసిన కామెంట్లు ముద్ర పడిపోయాయి. ఇంటి సభ్యులే కాకుండా బయట కూడా రవి పేరు గుంటనక్కగా మారిపోయేట్టుంది. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో యాంకర్ రవి మీద సన్నీ కామెంట్లు చేశాడు. ఇంట్లో అందరికీ ఒక్కో జంతువు పేరు పెట్టాడు. సిరి కట్లపాము, షన్ను నల్ల కుక్క, యానీ మాస్టర్ పాము అంటూ ఇలా రకరకాల పేర్లు పెట్టాడు. అయితే రవికి మాత్రం పాత పేరు అని చెప్పేశాడు.

VJ Sunny About Anchor Ravi Nature In Bigg Boss 5 Telugu
Bigg Boss 5 Telugu : యాంకర్ రవిపై సన్నీ కామెంట్లు
ఎన్ని జన్మలు ఎత్తినా కూడా ఆ మనిషికి నటరాజ్ మాస్టర్ పెట్టిన పేరు కరెక్ట్.. అతను గుంట నక్కే అని అనేశాడు. రవి మాటలు మార్చడం, తనను బ్యాడ్ బిహేవియర్ అని చెప్పడంతో సన్నీ బాగానే హర్ట్ అయినట్టు కనిపిస్తోంది. అందుకే ఇలా కామెంట్ చేసి ఉంటాడు. అయితే నామినేషన్ ప్రక్రియలోనూ సన్నీ, రవి మధ్య మంచి డిస్కషన్ జరిగింది. ఇంకా ఫేక్ అని అనుకుంటున్నావా? అని రవి అడిగితే అవును అంటూ సమాధానం ఇచ్చేశాడు.