Ravi Teja : రవితేజని దర్శకుడి భార్య అన్ని మాటలు అనేసింది ఏంటి?
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ పెద్దగా వివాదాల జోలికి వెళ్లడు. హిట, ఫ్లాప్స్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. రీసెంట్‌గా ఆయన నటించిన చిత్రం ఖిలాడి. ఈ సినిమా హిట్,ఫ్లాప్ టాక్ పక్కన పెడితే ఈ సినిమా దర్శకుడితో రవితేజకు ఏదో వైరం నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల ‘ఖిలాడి’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ, రమేష్ వర్మపై షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అవి కాస్తా సటైరికల్‌గా ఉన్నప్పటికి రమేష్ వర్మ వాటిని పెద్దగ పట్టించుకోలేదు. అంతేకాదు అంతా బాగానే ఉన్నట్లు ఇద్దరూ వ్యవహరించారు.
అయినప్పటికీ రవితేజ వ్యాఖ్యలు చూస్తుంటే వారిద్దరి మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నట్లు అనుమానాలు తలెత్తాయి.ఈ క్రమంలో ఖిలాడి సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ భార్య రేఖా వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరో రవితేజను ఉద్దేశిస్తూ చీప్ యాక్టర్ అంటూ కామెంట్ చేశారామే. గతంలో దర్శకుడు అజయ్ భూపతి రవితేజను చీప్ యాక్టర్ అని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైంది అంటూ పోస్ట్ పెట్టారు రేఖావర్మ. ఇది కలకలం రేపింది. రవితేజ, రమేశ్ వర్మ కాంబినేషన్‌లో గతంలో వీరా మూవీ వచ్చింది. మళ్లీ పదేళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చింది ఖిలాడీ.ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రవితేజ, డైరెక్టర్‌పై కాస్తా అసహనం చూపించాడు.

war between ravi teja and director wife
Ravi Teja : రవితేజతో వార్ ఎంత వరకు వెళుతుంది..
ఈ మేరకు అతడు మాట్లాడుతూ.. నిర్మాత సత్యన్నారాయణను ఉద్దేశించి ఖిలాడీ సినిమాకు సంబంధించి మీరే దగ్గరుండి అన్ని విషయాలు చూసుకోవాల్సిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతకు ముందు దర్శకుడు మహర్జాతకుడని, సినిమా రిలీజ్‌కు ముందే నిర్మాతతో కారు కూడా కొనిపించుకున్నాడంటూ సైటిరికల్‌గా వ్యాఖ్యలు చేశాడు రవితేజ. ఇక రచయిత శ్రీకాంత్ విస్సా కారణంగానే ఖిలాడి సినిమా చేయడానికి ఒప్పుకున్నా అని డైరెక్ట్‌గా చెప్పేశాడు. అసలు రవితేజకు, రమేష్ వర్మకు మధ్య ఏం జరిగిందనేది చర్చనీయాంశ కాగా.. ఈ వివాదంలోకి రమేష్ వర్మ రేఖ రావడం మరింత హాట్‌టాపిక్ మారింది. మరి ఇది ఎంతవరకు వెళుతుంది అనేది చూడాలి.