Prabhas : ప్రభాస్ పెళ్లి ఆ హీరోయిన్ తో జరిగి ఉంటే బాగుండేది..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్రభాస్ పెళ్లి ఆ హీరోయిన్ తో జరిగి ఉంటే బాగుండేది..?

 Authored By ramu | The Telugu News | Updated on :15 February 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Prabhas : ప్రభాస్ పెళ్లి ఆ హీరోయిన్ తో జరిగి ఉంటే..?

Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో Tollywood చాలామంది హీరోలు వారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఇండస్ట్రీలో ఏ హీరోకి లేనటువంటి స్టార్ డమ్ ను ఏర్పరచుకున్న ” రెబల్ స్టార్ ప్రభాస్ ” పాన్ ఇండియాలో తన సత్తాను చాటుతున్నాడు. బాహుబలి సినిమాతో విజయం అందుకున్న తర్వాత భారీ కలెక్షన్లతో సినిమాలను తీయడం విశేషం. ఇక కొన్ని సినిమాలు అయితే ఫ్లాప్ వచ్చినప్పటికీ 300 నుండి 400 కోట్ల వరకు కలెక్షన్ రాబట్టాయి. దీంతో ప్రతి సినిమా విషయంలో ప్రభాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ప్రభాస్ Prabhas హను రాఘవపూడి దర్శకత్వంలో వస్తున్న ఫౌజి అనే సినిమా చేస్తున్నాడు.

Prabhas ప్రభాస్ పెళ్లి ఆ హీరోయిన్ తో జరిగి ఉంటే బాగుండేది

Prabhas : ప్రభాస్ పెళ్లి ఆ హీరోయిన్ తో జరిగి ఉంటే బాగుండేది..?

అదేవిధంగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీకి సైన్ చేశాడు. ఇక త్వరలో ఈ మూవీ షూటింగ్ జరగబోతుందని సందీప్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో ఇప్పటికే మూడు సినిమాలు తీయగా అవి భారీ విజయాలను అందుకున్నాయి. అంతేకాకుండా వీరిద్దరి కాంబినేషన్ కి కూడా మంచి గుర్తింపు లభించింది. అదే సమయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. వాటన్నిటిని ప్రభాస్ మరియు త్రిష ఫేక్ అని తెలిపారు. ప్రస్తుతం ప్రభాస్ అభిమానులు ఆ సమయంలోనే వారిద్దరు పెళ్లి చేసుకుంటే బాగుండేదని ఇప్పుడు ప్రభాస్ ఒక ఇంటి వాడు అయ్యేవాడని అంటున్నారు.

కానీ ప్రభాస్ మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ తోటి హీరోలు అయినా Mahesh Babu మహేష్ బాబు, Pawan Kalyan పవన్ కళ్యాణ్ కొడుకులు హీరోలుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ప్రభాస్ Prabhas మాత్రం 50 సంవత్సరాల దగ్గరకి చేరుతున్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. ఆయన తర్వాత వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎవరు వస్తారు. అలాగే తన స్టార్ డమ్ ను ఎవరు నిలబడతారనే నిరాశ అభిమానులలో ఉంది. ఇక కృష్ణంరాజు తర్వాత రెబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్. పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మంచి పొజిషన్ ను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంలోనే రెబల్ స్టార్ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ హీరోగా ఎవరు వస్తారు అనే ప్రశ్నకి సమాధానం మాత్రం దొరకడం లేదు..

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది