Ramya Krishna : రమ్యకృష్ణ తన భర్తకి విడాకులు ఇచ్చిందా.. దూరంగా ఉండడానికి కారణం ఏంటి?
Ramya Krishna : సినిమా ఇండస్ట్రీలోని క్రేజీ కాంబినేషన్స్‌లో కృష్ణవంశీ- రమ్యకృష్ణ ఒకటి. దర్శకుడిగా కృష్ణ వంశీ డైరెక్టర్‌గా కాక ముందే రమ్యకృష్ణ ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్. ఇక దర్శకుడి కృష్ణవంశీ తెరకెక్కించిన ‘గులాబి’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. నాగార్జున హీరోగా.. ’నిన్నేపెళ్లాడతా’ సినిమాను తెరకెక్కించి మంచి సక్సెస్ అందుకున్నారు. కానీ కృష్ణవంశీ మొదటిసారి రమ్యకృష్ణను డైరెక్ట్ చేసింది నాగార్జున హీరోగా తెరకెక్కిన ‘చంద్రలేఖ’ సినిమా. ఈ సినిమాలో రమ్యకృష్ణ టైటిల్ రోల్ చంద్ర పాత్రను పోషించింది. సింధూరం, ఖడ్గం, అంతఃపురం.. వంటి సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన కృష్ణ వంశీ 2017లో నక్షత్రం అనే సినిమాను డైరెక్ట్ చేశారు.
Ramya Krishna : క్లారిటీ ఇచ్చాడు..
దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన చిత్రం ‘రంగ మార్తాండ’ . ఈ సినిమా మరాఠీ చిత్రం ‘నట సామ్రాట్’కి రీమేక్. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కి సిద్ధమవుతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇంటర్వ్యూలో కృష్ణ వంశీ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా.. కృష్ణవంశీ మాట్లాడుతూ..‘రమ్యకృష్ణ రేంజ్‌ని నేను మ్యాచ్ చేయాలనే టెన్షన్ ఉంటుంది. నాకు ఆమెతో కాంపిటిషన్ ఉంది. నాకు ఖాళీ ఉంటే నేను చెన్నైకి వెళ్తా. ఆమెకు ఖాళీ ఉంటే ఇక్కడికి వస్తుంది. నా కొడుకును బెబో అంటాం. మా అబ్బాయి రిత్విక్ చాలా షార్ప్, చాలా యాక్టివ్. క్రాస్ బ్రీడ్ కదా… తెలుగు, తమిళం, డైరక్షన్, యాక్టింగ్ అన్నీ క్రాస్ బ్రీడ్.
ఇప్పుడు రిత్విక్‌కి టీనేజ్. పదో తరగతి చదువుతున్నాడు. ఒక వారం క్రికెట్ అంటాడు. ఇంకో వారం బిజినెస్ అంటాడు. ఇంకో వారం క్రిప్టో కరన్సీ అంటాడు. అందులోనూ మద్రాసులో పెరిగాడు కదా. చెన్నైలో జనమే కాస్త యాక్టివ్‌గా ఉంటారు. రమ్య కొడుకు మీద 24 గంటలు ఓ కన్నేసి ఉంటుంది. కంప్లీట్ ఫ్యామిలీలో పెరుగుతున్నాడు కొడుకు. రమ్య అక్కడ, మీరిక్కడా ఉంటే చాలా పుకార్లు వస్తుంటాయి కదా.. వాటికి మేమే రియాక్ట్ కావడం లేదు. వాడేం రియాక్ట్ అవుతాడు. ఎవరేం కంగారు పడొద్దు, బాధపడొద్దు. నేనూ, రమ్య కలిసే ఉన్నాం. ఇలాంటి గాసిప్స్ ఎంతో మంది మీద కనిపిస్తూనే ఉంటాయి. అని కృష్ణ వంశీ చెప్పుకొచ్చాడు.