Samantha : స‌మంత సోష‌ల్ మీడియాకి దూరంగా ఉండ‌డానికి కార‌ణం ఏంటి? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : స‌మంత సోష‌ల్ మీడియాకి దూరంగా ఉండ‌డానికి కార‌ణం ఏంటి?

Samantha : ఇటీవ‌లి కాలంలో చాలా మంది సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదం పంచుతున్నారు. సినిమా విష‌యాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా షేర్ చేస్తూ వ‌స్తున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. ఇంకా చెప్పాలంటే, టాలీవుడ్ నుంచి యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో ఆమెదే మొదటి స్థానం. నిత్యం తన అభిమానుల్ని ఇనస్టాగ్రామ్ వేదికగా పలకరించే సమంత, సడెన్ గా సైలెంట్ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :17 July 2022,7:00 pm

Samantha : ఇటీవ‌లి కాలంలో చాలా మంది సెల‌బ్రిటీలు సోష‌ల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉంటూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదం పంచుతున్నారు. సినిమా విష‌యాల‌తో పాటు ప‌ర్స‌న‌ల్ విష‌యాలు కూడా షేర్ చేస్తూ వ‌స్తున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో సమంత ఒకరు. ఇంకా చెప్పాలంటే, టాలీవుడ్ నుంచి యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో ఆమెదే మొదటి స్థానం. నిత్యం తన అభిమానుల్ని ఇనస్టాగ్రామ్ వేదికగా పలకరించే సమంత, సడెన్ గా సైలెంట్ అయింది. సోషల్ మీడియాకు పూర్తిగా దూరమైందా అనే అనుమానాల‌ని రేకెత్తిస్తుంది. అదేంటో తెలియాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా వస్తుంటారు. కానీ, అందులో చాలా అంటే చాలా తక్కువ మంది మాత్రమే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు.

అలాంటి వారిలో గ్లామరస్ హీరోయిన్ సమంత రూత్‌ ప్రభు ఒకరు. ‘ఏమాయ చేశావే’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మాయలో పడేసిన ఈ చిన్నది.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోంది. ఫలితంగా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. న‌టిగా స‌మంత ఇమేజ్ రోజురోజుకి పెర‌గుతూ పోతుంది. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ చాలా కాలంగా హీరోయిన్‌గా సందడి చేస్తోన్న సమంత రూత్ ప్రభు.. ఆ మధ్య ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె చేసిన రాజి అనే టెర్రరిస్టు పాత్ర బాగా హైలైట్ అవడంతో నేషనల్ రేంజ్‌కు క్రేజ్‌ పెంచుకుంది. ఫలితంగా ఆమెకు బాలీవుడ్‌ ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇక రీసెంట్‌గా పుష్న సినిమాలో ఐటెం సాంగ్‌కి డ్యాన్స్ చేసి కూడా మంచి క్రేజ్ ద‌క్కించుకుంది.

What is the reason for Samantha staying away from social media

What is the reason for Samantha staying away from social media

మ‌రో వైపు సోష‌ల్ మీడియాలోను కేక పెట్టించే పిక్స్ షేర్ చేస్తూ త‌న క్రేజ్ పెంచుకుంటూ వ‌స్తుంది.విడాకుల ద‌గ్గ‌ర నుండి స‌మంత సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా మారింది. నిత్యం ఏదో ఒక కొటేషన్ పెడుతుంది సమంత. అది లేకపోతే తన కుక్కకు సంబంధించిన వీడియో పోస్ట్ చేస్తుంది. లేదంటే తను జిమ్ లో వర్కవుట్ చేసేది పెడుతుంది. ఇవేవీ లేవనుకుంటే ఫొటో షూట్ లేదా ఆమె సినిమా అప్ డేట్.. ఇలా ఏదో ఒకటి ఉంటుంది. కానీ.. గడిచిన 2 వారాలుగా ఆమె నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఆమె సోషల్ మీడియా ఖాతాలు మూగబోయాయి. సమంత చివరిగా జూన్‌ 30న ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టింది. ఆ తర్వాత ఆమె సోషల్‌ మీడియాకు దూరమై పోయింది. ట్విటర్‌లో కూడా ఎలాంటి పోస్ట్‌ పెట్టలేదు. ఆ మధ్య సామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ హ్యాక్‌ అయిందని ఆమె టీమ్‌ పేర్కొంది. ఆ తర్వాత సమంత నుండి ఒక్క పోస్ట్ కానీ, స్టోరీ కానీ లేదు.

తరచు తన ఫోటోలను అప్‌లోడ్‌ చేసే సామ్‌… 15 రోజులు గడిచిన ఎలాంటి అప్‌డేట్స్‌ ఇవ్వకపోవడంతో ఆమె ఫాలోవర్స్‌లో ఆందోళన మొదలైంది. సామ్‌ ఎందుకు నెట్టింటికి రాలేకపోతుంది? సినిమా షూటింగ్స్‌లో బిజీగా ఉందా? లేదా కావాలనే ఆమె సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటుందా అనే చర్చ నెట్టింట మొదలైంది. దీనిపై క్లారిటీ ఎప్పుడు ఇస్తుందో చూడాలి మ‌రి. సమంత రూత్ ప్రభు ఇటీవలే విఘ్నేష్ శివన్ తెరకెక్కించిన ‘కాతు వాకుల్ రెండు కాదల్’ అనే తమిళ చిత్రంతో వచ్చింది. నయనతార, విజయ్ సేతుపతి కూడా నటించిన ఈ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఇక, ప్రస్తుతం సామ్.. గుణశేఖర్‌ తెరకెక్కిస్తోన్న ‘శాకుంతలం’ మూవీ చేస్తోంది. ఇప్పటికే షూట్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది