Bigg Boss Season 09 : బిగ్ బాస్ సీజన్ 09 హోస్ట్ ఎవరు తెలిసిపోయింది.. నాగార్జున మాత్రం కాదు..!
ప్రధానాంశాలు:
Bigg Boss Season 09 : బిగ్ బాస్ సీజన్ 09 హోస్ట్ ఎవరు తెలిసిపోయింది.. నాగార్జున మాత్రం కాదు..!
Bigg Boss Season 09 : తెలుగు టెలివిజన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్ మరోసారి హోస్ట్ విషయంలో మార్పులు చేస్తుంది. ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్ చేసిన ఈ షోకు, నాని రెండో సీజన్‌ను నిర్వహించగా, మూడో సీజన్ నుంచి ఎనిమిదో సీజన్ వరకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొనసాగారు. నాగార్జున తనదైన శైలిలో షోను నడిపించడమే కాకుండా, కంటెస్టెంట్లను సమర్థంగా హ్యాండిల్ చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ నాగార్జున ఈసారి హోస్ట్ చేయడానికి ఆసక్తి చూపటం లేదని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో షో మేకర్స్ 9వ సీజన్ కోసం కొత్త హోస్ట్ ఎంపిక చేసే పనిలో ఉన్నారు. మరి ఆ కొత్త హోస్ట్ ఎవరు? అనే దానిపై ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నాగార్జున షో నుంచి తప్పుకోవడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన తన సినిమాలకు ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

Bigg Boss Season 09 : బిగ్ బాస్ సీజన్ 09 హోస్ట్ ఎవరు తెలిసిపోయింది.. నాగార్జున మాత్రం కాదు..!
Bigg Boss Season 09 బిగ్ బాస్ నుండి తప్పుకున్న నాగార్జున..?
అలాగే గత కొన్ని సీజన్లుగా TRP రేటింగ్స్ తగ్గడం కూడా కారణంగా చెప్పుకోవచ్చు. షో మేకర్స్ కొత్తదనం కోసం కొత్త హోస్ట్‌ను తీసుకురావాలని చూస్తున్నట్లు టాక్. ఈ క్రమంలో బిగ్‌బాస్ యాజమాన్యం కొత్త హోస్ట్‌గా విజయ్ దేవరకొండ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. యంగ్ జెనరేషన్‌లో విజయ్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండటం, అతని మాస్ అప్పీల్, కౌంటర్లు, బాడీ లాంగ్వేజ్ – ఇవన్నీ బిగ్‌బాస్ హోస్టింగ్‌కు కొత్త ఎనర్జీని తీసుకురావచ్చని భావిస్తున్నారట. అయితే విజయ్ టాక్ షోలు హోస్ట్ చేసిన అనుభవం లేదు. కానీ ఇంటర్వ్యూ లు చేసిన సందర్భాలు ఉండడంతో విజయ్ హోస్ట్ గా సక్సెస్ అవుతాడని భావిస్తున్నారు.
విజయ్ దేవరకొండతో పాటు మరో కొంత మంది ప్రముఖుల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రానా దగ్గుబాటి, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ లిస్టులో ఉన్నారు. రానా స్టైల్, ఎన్టీఆర్ హోస్టింగ్ స్కిల్స్, బాలకృష్ణ హై ఎనర్జీ బిగ్‌బాస్‌కు కొత్త వాతావరణాన్ని అందించవచ్చని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం బిగ్‌బాస్ మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే కొత్త హోస్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.