Minister Roja : మంత్రి అయినా మల్లెమాల జబర్దస్త్‌ తో రోజా సంబంధాలు కంటిన్యూ.. కారణం ఇదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Minister Roja : మంత్రి అయినా మల్లెమాల జబర్దస్త్‌ తో రోజా సంబంధాలు కంటిన్యూ.. కారణం ఇదేనా?

 Authored By prabhas | The Telugu News | Updated on :4 January 2023,8:20 pm

Minister Roja : జబర్దస్త్‌ కార్యక్రమం ఆరంభం అయ్యి పది సంవత్సరాలు కాబోతుంది. ఈ పదేళ్లలో దాదాపు 9 సంవత్సరాల పాటు జబర్దస్త్‌ యొక్క జడ్జ్ సీటు లో రోజా కూర్చున్న విషయం తెల్సిందే. ఎమ్మెల్యే గా ఎంపిక అయిన తర్వాత కూడా జబర్దస్త్‌ కార్యక్రమంను రోజా వదిలి పెట్టలేదు. ఎట్టకేలకు మంత్రి పదవి వచ్చిన తర్వాత జబర్దస్త్‌ కార్యక్రమానికి వీడ్కోలు పలికింది. జబర్దస్త్‌ ను వీడిన సమయంలో రోజా కన్నీళ్లు పెట్టుకున్న సంగతి అందరికి తెల్సిందే. జబర్దస్త్‌ తో ఆమెకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా

చెప్పనక్కర్లేదు అని ఆ కన్నీళ్లు సాక్ష్యం.ఇటీవల జబర్దస్త్‌ కార్యక్రమం 500 ఎపిసోడ్‌ లు పూర్తి చేసుకుంది. ఆ సందర్భంగా రోజా ప్రత్యేక అతిథిగా వచ్చింది. అదే సమయంలో ఆమె 10 ఏళ్ల ప్రత్యేక ఎపిసోడ్‌ లో కూడా హాజరు అయ్యేందుకు ఓకే చెప్పారు అంటూ వార్తలు వస్తున్నాయి. జబర్దస్త్‌ కార్యక్రమం తో రోజా ఇంకా సంబంధాలు కంటిన్యూ చేస్తున్నారు. ప్రత్యేక ఎపిసోడ్స్ మరియు ఇతర ముఖ్య ఈవెంట్స్ కు హాజరు అవ్వడం ద్వారా మల్లెమాల మరియు ఈటీవీ వారితో సన్నిహిత సంబంధాలను ఆమె నెరుపుతూనే ఉంది.

why Minister Roja continue connection with jabardasth show

why Minister Roja continue connection with jabardasth show

మంత్రి అయిన తర్వాత కూడా రోజా ఎందుకు జబర్దస్త్‌ కార్యక్రమానికి దూరం అవ్వలేదు.. ఇంకా సంబంధాలు కంటిన్యూ అవ్వడానికి కారనం ఏమై ఉంటుంది అంటూ కొందరు అనుమానలు వ్యక్తం చేస్తున్నారు. అసలు విషయం ఏంటీ అంటే రోజా ఇప్పుడు కాకున్నా ఇంకా కొన్నాళ్ల తర్వాత అయినా జబర్దస్త్‌ లో రీ ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారు. మంత్రి పదవి ఎప్పటి వరకు ఉంటుంది అనేది క్లారిటీ లేదు. కనుక ఆమె జబర్దస్త్‌ కార్యక్రమం తో సంబంధాలు కంటిన్యూ చేసి.. రాజకీయాల్లో క్రియాశీలకంగా లేని సమయంలో మళ్లీ జబర్దస్త్‌ జడ్జ్ స్థానంలో కూర్చునే అవకాశం ఉందని అంటున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది