Anushka Shetty : అనుష్కను చూస్తేనే పిచ్చెక్కించే పార్ట్ అదేనా.. అందుకే జనాలు ఆమె అంటే పడిచచ్చిపోతారా?
Anushka Shetty : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ఎంత చెప్పినా తక్కువే. తను సూపర్ డూపర్ టాలెంట్ ఉన్న నటి. తన నటనను నచ్చని వాళ్లు ఉండరు. ఏకంగా దర్శకధీరుడు రాజమౌళే ఆమె నటనకు ఫిదా అయిపోతారు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా అనుష్కకు హీరోయిన్ గా చాన్స్ ఇచ్చారు రాజమౌళి. ఇక.. అనుష్క ఏ హీరోకు అయినా కరెక్ట్ గా సెట్ అవుతుంది. కుర్ర హీరోలు అయినా.. సీనియర్ హీరోలు అయినా అందరి ముందు అనుష్క కరెక్ట్ గా సెట్ అవుతుంది.
సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది అనుష్క శెట్టి. నిజానికి.. సినిమా ఇండస్ట్రీకి అనుష్క రావడం ఒక మిరాకిల్ అనే అనుకోవాలి. ఎందుకంటే తను ఏనాడూ సినిమా ఇండస్ట్రీకి రావాలనుకోలేదు. తను ఏనాడూ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పనిచేయాలనుకోలేదు. సూపర్ సినిమా సక్సెస్ తో అసలు తను ఒక స్టార్ హీరోయిన్ రేంజ్ కు వెళ్లిపోయింది. ఊహించకుండానే వరుసగా తనకు అవకాశాలు వచ్చి చేరాయి. అయితే.. తనకు అంతలా అవకాశాలు రావడానికి మరో కారణం.. తన కళ్లు. మత్తెక్కించే కళ్లు తనవి.
Anushka Shetty : ప్రాణం పెట్టి మరీ సినిమాలో నటిస్తుంది అనుష్క
అనుష్క ఒక క్యారెక్టర్ ఒప్పుకుందంటే ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చేస్తుంది. అద్భుతంగా నటిస్తుంది. అందుకే తను తెలుగులో స్టార్ హీరోయిన్ అయింది. తన పేరుకు తగ్గట్టుగానే తను చాలా స్వీట్ పర్సన్. అంతే కాదు.. తన హైట్ కూడా తనకు ప్లస్ పాయింట్. తన హైట్ వల్లనే తను అందరు హీరోల పక్కన హీరోయిన్ గా సెట్ అవుతోంది. తను నటనలో ప్లస్సే… ఇండస్ట్రీలో తను ఉండే తీరు కూడా ప్లస్సే. ఇవన్నీ కలిపి అనుష్కకు చాల ప్లస్ పాయింట్స్ తీసుకొచ్చాయి. మొత్తానికి తనను ఇండస్ట్రీలో ఒక స్టార్ రేంజ్ కు తీసుకెళ్లాయి.