Posani Krishna Murali : పోసానిని పక్కకు పెట్టేసిన జబర్దస్త్‌ టీమ్‌.. కారణం అదేనంటున్న మల్లెమాల టీమ్‌

Advertisement

Posani Krishna Murali : జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభించిన సమయం లో జడ్జిగా నాగబాబు మరియు రోజా వ్యవహరించిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల వల్ల నాగబాబు తప్పు కోవడంతో సింగర్ మనో ఎంట్రీ ఇచ్చాడు. ఆయన కూడా కొన్ని కారణాల వల్ల ఈ మధ్య తప్పుకున్నాడు. దాంతో పోసాని మరియు కృష్ణ భగవాన్ లను తీసుకొచ్చారు. ఈ మధ్య కాలంలో పోసాని అస్సలు కనిపించడం లేదు. అన్ని చోట్ల కూడా కృష్ణ భగవాన్ ఎక్కువగా కనిపిస్తున్నాడు దాంతో పోసానిని మల్లెమాల వారు పక్కకు పెట్టారు అనే ప్రచారం జరుగుతుంది.

Advertisement
why Posani Krishna Murali out from jabardasth comedy show
why Posani Krishna Murali out from jabardasth comedy show

సినిమాలతో బిజీగా ఉండే పోసాని కృష్ణ మురళి ప్రతి ఎపిసోడ్ కి భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అందుకే భారీగా రేటింగ్ రావడం లేదనే ఉద్దేశ్యంతో జబర్దస్త్ టీం వారు ఆయన తీసి పక్కకు పెట్టేశారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా పోసాని కామెడీ పంచ్ లు ఉంటాయి.. అలాంటి పోసాని తొలగించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు జబర్దస్త్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ భగవాన్ తో పాటు పోసాని కృష్ణ మురళి కూడా ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు.

Advertisement
why Posani Krishna Murali out from jabardasth comedy show
why Posani Krishna Murali out from jabardasth comedy show

కొందరు మాత్రం పోసాని ఓవరాక్షన్ కనుక ఆయన్ని తొలగించడం మంచిదే అంటున్నారు, మొత్తానికి జబర్దస్త్ కార్యక్రమం నుండి పోసాని కృష్ణ మురళి అత్యధికంగా రెమ్యూనరేషన్ దక్కడం లేదనే ఉద్దేశంతో తప్పుకున్నాడా లేదంటే మీకు భారీ గా పారితోషికం ఇవ్వడం మా వల్ల కాదు అంటూ మల్లెమాల వారు ఆయన్ని తప్పించారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇంద్రజ మరియు కృష్ణ భగవాన్ జబర్దస్త్ కార్యక్రమం ముందుకు నడిపిస్తున్నారు.

Advertisement
Advertisement