Ram Prasad : సుధీర్‌, గెటప్‌ శ్రీనులు సినిమాల్లో బిజీ.. రామ్‌ ప్రసాద్‌ ఎందుకు బిజీ అవ్వడం లేదు?

Advertisement

Ram Prasad జబర్దస్త్ పేరు చెప్పగానే ఎక్కువ శాతం మందికి గుర్తు వచ్చే కమెడియన్స్ సుడిగాలి సుదీర్, హైపర్ ఆది, గెటప్ శీను మరియు రామ్ ప్రసాద్. వీరు జబర్దస్త్ కి మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ కి కూడా అత్యంత కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న పలు కామెడీ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలకు వీరు ప్రాణం పోస్తున్నారు. గెటప్ శ్రీను శ్రీదేవి డ్రామా కంపెనీలో పూర్తి స్థాయిలో కనిపించకున్నా అప్పుడప్పుడు వచ్చి సందడి చేస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాడు.

Advertisement

ఇక సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మరియు రాంప్రసాద్ లు చేస్తున్న ఎంటర్టైన్మెంట్ పీక్స్ లో ఉంది అంటూ బుల్లి తెర వర్గాల వారు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బుల్లి తెర మీద సందడి చేసే వారికి వెండి తెర నుండి ఆఫర్లు రావడం చాలా కామన్ గా జరుగుతుంది. వీళ్లకు కూడా వెండితెర నుండి పెద్ద ఎత్తున ఆఫర్లు వస్తున్నాయి. హైపర్ ఆది ఇటీవలే భీమ్లా నాయక్ సినిమాలో కనిపించడంతో పాటు ఇంకా పలు సినిమాల్లో నటిస్తున్నాడు.

Advertisement
why ram prasad not doing more movies
why ram prasad not doing more movies

మరోవైపు సుడిగాలి సుధీర్ పలు సినిమా ల్లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక గెటప్ శ్రీను కి చేతిలో ఏకంగా పది సినిమాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీళ్లు సినిమాలతో చాలా బిజీగా ఉన్నా రాంప్రసాద్ మాత్రం సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నాడు అనిపిస్తుంది. అతను నటించిన సినిమాలు ఎక్కువగా ప్రేక్షకుల ముందుకు రావడం లేదా లేదంటే ఆయన సినిమాల్లో నటించడం లేదా అనేది ఇప్పుడున్న చర్చ. అసలు విషయం ఏంటంటే రామ్ ప్రసాద్ నటన కంటే ఎక్కువగా రచన పై ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. యాక్టింగ్ పై ఉన్న ఆసక్తి కంటే రైటింగ్ పై అతనికి ఉన్న ఆసక్తి ఎక్కువ. అందుకే సినిమాలకు రాంప్రసాద్ రైటర్గా పని చేస్తున్నాడని మంచి అవకాశం వస్తే నటన తో కూడా రాంప్రసాద్ ఆకట్టుకుంటాడు అంటూ ఆయన అభిమానులు సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement