Intinti Gruhalakshmi : అభిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తులసి ఏం చేస్తుంది? అభికి బెయిల్ రాకుండా పోలీస్ ఏం చేశాడు? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi : అభిని పోలీసులు అరెస్ట్ చేయడంతో తులసి ఏం చేస్తుంది? అభికి బెయిల్ రాకుండా పోలీస్ ఏం చేశాడు?

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 20 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ 561 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభిని వెతకడం కోసం తులసి వెళ్తుంది. మరోవైపు అభి పోలీసుల నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో తులసి.. అభిని చూస్తుంది. వెంటనే అభి అని పిలుస్తుంది. అభి తన దగ్గరికి వెళ్తాడు. మామ్ అని తననను కౌగిలించుకుంటాడు. నీ మాటలు […]

 Authored By gatla | The Telugu News | Updated on :20 February 2022,9:30 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఇవాళ ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 20 ఫిబ్రవరి 2022 ఎపిసోడ్ 561 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అభిని వెతకడం కోసం తులసి వెళ్తుంది. మరోవైపు అభి పోలీసుల నుంచి తప్పించుకొని పరిగెడుతూ ఉంటాడు. ఇంతలో తులసి.. అభిని చూస్తుంది. వెంటనే అభి అని పిలుస్తుంది. అభి తన దగ్గరికి వెళ్తాడు. మామ్ అని తననను కౌగిలించుకుంటాడు. నీ మాటలు విననందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది అని గుక్కపెట్టి ఏడుస్తాడు. దీంతో తులసి కూడా ఏడుస్తుంది. అసలు ఏం జరిగిందిరా అని అడుగుతుంది తులసి. దీంతో 10 లక్షలు అప్పు తీసుకున్నానని.. ఆ డబ్బును తన ఫ్రెండ్ కు ఇచ్చానని.. వాడు మోసం చేసి ఆ డబ్బుతో పరారయ్యాడని చెబుతాడు అభి.

will abhi gets bail and what tulasi will do

will abhi gets bail and what tulasi will do

దీంతో తులసి షాక్ అవుతుంది. వాడిని చంపాలనుకోలేదని.. పెనుగులాటలో వాడికి బీరు సీసా గుచ్చుకుందని చెబుతాడు అభి. ఇంతలోనే పోలీస్ జీప్ వచ్చి ఆగుతుంది. పోలీస్ జీప్ ను చూడగానే అభి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు. తులసి వద్దు అంటుంది. అయినా కూడా వినడు అభి. తులసిని నెట్టేసి అక్కడి నుంచి పారిపోబోతాడు. దీంతో పోరాపో.. నువ్వు వచ్చే వరకు నీ అమ్మ లాకప్ లోనే ఉంటది అంటాడు ఎస్ఐ. దీంతో అభి తిరిగి అక్కడికి వచ్చేస్తాడు. ఎస్ఐ గారు మా అమ్మను వదిలేయండి సార్.. నేను లొంగిపోతాను అంటాడు అభి. ఎవడి కోసం లొంగుతావురా. లొంగకపోతే కబడ్డి ఆడుకోను అంటాడు పోలీస్. అభిని పట్టుకొని కొడతాడు పోలీస్.

ఎస్ఐ గారు మా అభి ఎలాంటి తప్పు చేయలేదు అంటుంది తులసి. ఎవ్వరైనా ముందు చెప్పేది ఇదే. నేను ఒప్పిస్తాను కదా అంటాడు పోలీస్. తులసి ఎంత చెప్పినా పోలీస్ వినడు. ఒక్క గంట తర్వాత స్టేషన్ కు రా. నీ కొడుకు తన నోటితోనే నిజం చెబుతాడు అంటాడు.

కానిస్టేబుల్స్ వాడిని బండి ఎక్కించండి అంటాడు పోలీస్. దీంతో ఎస్ఐ గారు ఇది అన్యాయం సార్. చేయని తప్పును బలవంతంగా ఒప్పించడం ఏంటి అంటుంది తులసి. నీ మాట నేను నమ్మలా.. మదర్ ఇండియా. ఎస్ఐ గారు మా మామ్ ను ఏమీ అనకండి అంటాడు అభి.

అవును మదర్ ఇండియా నీ మొగుడు ఏడి.. నువ్వు ఒక్కదానివే కనిపిస్తున్నావు అని అడుగుతాడు పోలీస్. దీంతో నాకు భర్త లేడు అంటుంది తులసి. అచ్చా.. అవునా.. మరి మెడలో తాళి ఉంది.. అవును మొగుడు లేడన్నావు. మరి వీడు ఎక్కడి నుంచి వచ్చాడు. కనీసం ఎవడికి పుట్టాడో అదైనా తెలుసా అంటాడు పోలీస్.

Intinti Gruhalakshmi : అభి గురించి టెన్షన్ పడ్డ అంకిత

దీంతో అభికి కోపం వస్తుంది. వెళ్లి పోలీస్ కాలర్ పట్టుకుంటాడు. ఇంకొక మాట మా అమ్మ గురించి మాట్లాడావో చంపేస్తా ఏమనుకున్నావో అంటాడు అభి. దీంతో పోలీస్ ఈగో హర్ట్ అవుతుంది. ఎస్ఐ గారికి క్షమాపణ చెప్పరా అంటుంది తులసి. దీంతో సారీ అంటాడు అభి.

నా ఈగోను నువ్వు టచ్ చేస్తావా.. నీ సంగతి చూస్తా అంటూ అభిని పోలీస్ జీప్ లో వేసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతారు. మరోవైపు అభి గురించే ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతుంటారు. అభి కనిపించాడో లేదో అని అనుకుంటారు. ఇంతలో తులసి వస్తుంది.

అభి కనిపించాడా అని అందరూ అడుగుతారు. దీంతో కనిపించాడు అని చెబుతారు. మరి.. ఏడి ఇంటికి తీసుకురాలేదు అని అడుగుతుంది అంకిత. దీంతో అభి కనిపించాడు కానీ.. పోలీసులు అరెస్ట్ చేశారు. స్టేషన్ కు తీసుకెళ్లారు. చాలా దీనావస్థలో అభి నాకు కనిపించాడు. నన్ను చూడగానే వెక్కి వెక్కి ఏడ్చాడు అంటుంది తులసి.

ఓదార్చి ఇంటికి తీసుకొచ్చే లోపు పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. ఎంత బతిమిలాడినా వినకుండా స్టేషన్ కు తీసుకెళ్లారు అని చెబుతుంది తులసి. నేను చెబుతూనే ఉన్నాను.. మనం అభిని కలవడం మంచిది కాదని.. అనుకున్నదే జరిగింది అంటాడు అభి.

అభితో మాట్లాడావా.. అసలు ఏం జరిగింది అని అడుగుతాడు నందు. దీంతో డబ్బు కోసం ఫ్రెండ్ తో గొడవ జరిగిందని ఒప్పుకున్నాడు అంటుంది తులసి. తను చంపడానికి ప్రయత్నించలేదట.. అని చెబుతుంది తులసి. అయినా వినకుండా పోలీసులు అభిని అరెస్ట్ చేశారు అంటుంది తులసి.

తన జీవితంలో పాటు నా జీవితాన్ని కూడా నాశనం చేశాడు. అభిని చూడాలి. అభితో మాట్లాడాలి అంటుంది అంకిత. నాకు అభి కావాలి. నా అభి నాకు కావాలి ఆంటి అంటుంది అంకిత. వాడు ఏ తప్పు చేయలేదు. వాడికి ఏం కాదు. వాడిని నేను కాపాడి తీసుకొస్తాను. నన్ను నమ్ము అంటుంది తులసి.

మరోవైపు లాయర్ ను తీసుకొని స్టేషన్ కు వెళ్తుంది తులసి. అదేంటి లాయర్ గారు.. చూస్తే అనుభవం ఉన్నవారిలా సీనియర్ లాయర్ లా ఉన్నారు. అరెస్ట్ చేయని మనిషి కోసం బెయిల్ పేపర్స్ ఎలా రెడీ చేశారు అని అంటాడు ఎస్ఐ. దీంతో మీరు అబద్ధం చెబుతున్నారు. నా అభిని మీరే అరెస్ట్ చేశారు అంటుంది తులసి.

మీకు నమ్మకం రావడం లేదా. అరెస్ట్ చేస్తే ఎక్కడ పెడతాం. సెల్ లో పెడతాం కదా. వెళ్లి చూసుకోండి అని అంటాడు పోలీస్. తులసి వెళ్లి అన్ని సెల్ లలో చెక్ చేస్తుంది. కానీ.. అభి ఉండడు. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది