Vijay : బీస్ట్ ఎఫెక్ట్ విజయ్ తెలుగు డెబ్యూ మీద అంతగా పడబోతుందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vijay : బీస్ట్ ఎఫెక్ట్ విజయ్ తెలుగు డెబ్యూ మీద అంతగా పడబోతుందా..?

 Authored By govind | The Telugu News | Updated on :14 April 2022,3:30 pm

Vijay: తమిళ స్టార్ హీరోలు ఇప్పుడు మన టాలీవుడ్ మీద దండ యాత్ర చేసేందుకు ట్రై చేస్తున్నారు. కోలీవుడ్ స్టార్స్‌గా వెలుగుతున్న సీనియర్ హీరోలు సూపర్ స్టార్ రజనీకాంత్, విశ్వ నటుడు కమల్ హాసన్ ఇప్పుడు తెలుగులో స్ట్రైట్ సినిమా చేయాలనే ఆరటం లేదు గానీ, ఈ జనరేషన్ హీరోలు మాత్రం మన టాలీవుడ్ మార్కెట్ మీద పట్టు సాధించేందుకు బాగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ హీరోలు తెలుగులో స్ట్రైట్ సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు.

వారిలో తలపతి విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ ముందు వరుసలో ఉన్నారు. ఇంకా సూర్య, కార్తి, అజిత్ ఆ ఆలోచన చేయడం లేదు. తలపతి విజయ్ తెలుగులో ఎంట్రీ ఇస్తూ దిల్ రాజు నిర్మాణంలో ఓ పాన్ ఇండియన్ సినిమాను చేయబోతున్నా డు. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వంవహిస్తారు. ఇప్పటికే, ప్రాజెక్ట్‌ను అఫీషియల్‌గా కూడా ప్రకటించారు. శివ కార్తికేయన్ తెలుగులో చేస్తున్న స్ట్రై మూవీకి జాతి రత్నాలు ఫేమ్ కెవి అనుదీప్ దర్శకత్వం వహించనున్నాడు. అలాగే, సితార బ్యానర్‌లో ధనుష్ ఒక సినిమాను చేస్తున్నాడు. సార్ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.

will beast show effect on vijay in tollywood

will beast show effect on vijay in tollywood

Vijay : బీస్ట్ కూడా ఫ్లాపవడంతో దిల్ రాజు సినిమా ఇక్కడ వర్కౌట్ అవుతుందా.

అయితే, ఇప్పుడు ఈ హీరోలతో తెలుగులో ప్రాజెక్ట్స్ వర్కౌట్ అవుతాయా అని సందేహాలు మొదలయ్యాయి. దానికి కారణం విజయ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా బీస్ట్. అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బీస్ట్ అట్టర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అసలే విజయ్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ఆదరణ అంతంత మాత్రం. ఇప్పుడు బీస్ట్ కూడా ఫ్లాపవడంతో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా విషయంలో పలు కొత్త సందేహాలు మొదలయ్యాయి. విజయ్ మార్కెట్‌కు తగ్గట్టు దిల్ రాజు సినిమా నిర్మిస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుందా. ఒక రకంగా ఇది మేకర్స్ చేస్తున్న పెద్ద సాహసం అని చెప్పుకుంటునారు. మొత్తానికి బీస్ట్ ఎఫెక్ట్ విజయ్ తెలుగు డెబ్యూ మూవీపై గట్టిగానే పడిందంటున్నారు.

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది