Intinti Gruhalakshmi : తులసికి సవాల్ విసిరినట్టుగానే… కుటుంబ సభ్యులను అందరినీ తన వైపునకు లాస్య తిప్పుకుంటుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi : తులసికి సవాల్ విసిరినట్టుగానే… కుటుంబ సభ్యులను అందరినీ తన వైపునకు లాస్య తిప్పుకుంటుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :15 January 2023,9:30 am

Intinti Gruhalakshmi : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. 16 జనవరి 2023, సోమవారం ఎపిసోడ్ 843 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సామ్రాట్ తులసి గురించే ఆలోచిస్తున్నాడని బాబాయి తెలుసుకుంటాడు. ఇప్పుడు బాధపడి ఏంటిరా ఉపయోగం అంటాడు బాబాయి. దీంతో తులసి తన ఇంటికి వెళ్లిపోయిందని బాధపడకు. ముందే నువ్వు తులసికి ఆ విషయం చెప్పేసి ఉంటే బాగుండేది అని అంటాడు బాబాయి. దీంతో తులసి ముందే మా మధ్య బంధం గురించి కుటుంబ సభ్యులకు క్లారిటీ ఇచ్చేసింది. నేను కేవలం తనకు ఫ్రెండ్ మాత్రమే. నువ్వు చెప్పినట్టు నేను ఆవేశపడి తులసికి అసలు విషయం చెప్పేసి ఉంటే కొంప కొల్లేరు అయ్యేది అంటాడు సామ్రాట్.

will lasya get good marks with family members in intinti gruhalakshmi

will lasya get good marks with family members in intinti gruhalakshmi

కట్ చేస్తే మళ్లీ రాములమ్మను పనిలోకి పిలుస్తుంది తులసి. కేవలం శృతి పనులనే చూసుకోవాలని రాములమ్మకు చెబుతుంది. దీంతో శృతి మాత్రం నా పనులు నేను చూసుకుంటాను. నువ్వు కేవలం వంటింటి పనులు చూసుకో అంటుంది శృతి. దీంతో అప్పుడే వచ్చిన తులసి ఏం కాదు.. శృతి పనులు చూసుకుంటే చాలు అంటుంది. మరోవైపు ఫ్రిడ్జ్ చూసి తాళం వేసి ఉండటంతో షాక్ అవుతుంది రాములమ్మ. కోపంతో లాస్య దగ్గరికి వెళ్లి తన దగ్గర ఉన్న తాళం గుత్తిని లాక్కుంటుంది. దీంతో నీకు ఎంత ధైర్యం అంటూ లాస్య.. తులసిపై సీరియస్ అవుతుంది. వీళ్లు అంతా నావాళ్లు. ఎప్పటికైనా నా వైపు తిరగాల్సిందే అంటుంది లాస్య. అది జరగని పని. వాళ్లు నా వాళ్లు అంటుంది తులసి.

నా మొగుడిని లాక్కున్నట్టు నా పిల్లలు, అత్తామామలను లాక్కుందామనుకుంటున్నావా అంటుంది తులసి. దీంతో నేనే ఈ ఇంటి కోడలును. నాకే ఈ ఇంటి మీద అధికారం ఉంది.. అని నిరూపిస్తా అని సవాల్ విసురుతుంది.

Intinti Gruhalakshmi : కుటుంబ సభ్యుల మీద అతి ప్రేమ చూపించిన లాస్య

ఎలాగైనా నెల రోజుల్లో ఇంట్లోని వాళ్లందరినీ నా వైపునకు తిప్పుకుంటా. చూడు.. అందరూ నా మాట వినేలా చేస్తా.. అంటూ తులసికి చాలెంజ్ చేస్తుంది లాస్య. దీంతో సరే.. అదీ చూద్దాం అని తులసి తాళాల గుత్తి తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఇక.. అప్పటి నుంచే ఇంట్లోని వాళ్లందరినీ మచ్చిక చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది లాస్య. వంట వండాక అందరూ తినడానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొంటారు. దీంతో తులసి వడ్డిస్తుంటే వచ్చి.. గిన్నెలు లాక్కొని పని చేసి చేసి అలసిపోయావు.

ఇటు ఇవ్వు.. నేను వడ్డిస్తా అంటూ ఆవేశపడి.. కూరను నందు మీద పడేస్తుంది లాస్య. దీంతో అందరూ కాసేపు నవ్వుకుంటారు. దీంతో నందు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు అనసూయ కాళ్లు పడతా అని చెప్పి… అనసూయ కాళ్లు విరగగొట్టిన పని చేస్తుంది లాస్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది