Guppedantha Manasu : రిషి పెళ్లి ఆపడం కోసం ఇంట్లో నుంచి వెళ్లిపోదామని జగతితో చెప్పిన మహీంద్రా.. ఇద్దరూ ఇంట్లో నుంచి వెళ్లిపోతారా?
Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. గుప్పెడంత మనసు 15 ఆగస్టు 2022, సోమవారం ఎపిసోడ్ 529 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి మనసు మార్చడం కోసం జగతి, మహీంద్రా ఇద్దరూ రిషి దగ్గరికి వస్తారు. రిషికి ఎంత చెప్పినా రిషి మాత్రం వినడు. ఇంతలో సాక్షి అక్కడికి వస్తుంది. రెండు డ్రెస్సులు తీసుకొచ్చి ఇందులో ఏ డ్రెస్ వేసుకోవాలి అని అడుగుతుంది సాక్షి. తనను చూసి వసుధర అనుకొని నీకు ఈ రెండు డ్రెస్సుల్లో ఏదీ బాగోదు వసుధర అంటాడు రిషి. తనను వసుధర అనడంతో సాక్షికి కోపం వస్తుంది. దీంతో ఏం చేయాలో తనకు అర్థం కాదు. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది సాక్షి.

will rishi be ready to get engaged with sakshi
మరోవైపు రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది వసుధర. ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. ఎందుకు వచ్చావు అని అడుగుతుంది జగతి. ఎందుకు వచ్చావు అని మళ్లీ అడుగుతుంది. ఏం చేద్దామని వచ్చావు. ఓడిపోయావని మాకు గుర్తు చేద్దామనా అంటుంది జగతి. దీంతో ఏంటి మేడమ్ మీరు.. ఇప్పుడు ఏమైందని అంటుంది వసుధర. నువ్వు బాధపడ్డా.. మేము ఇంత బాధపడం కానీ.. నువ్వు బాధపడకుండా ఇలా చిరునవ్వు నటిస్తున్నావు చూడు అంటుంది జగతి.
Guppedantha Manasu : రిషి లగ్నపత్రిక వేడుకల ఏర్పాట్లు చేసిన గౌతమ్, వసుధర
వసు.. నిన్ను ఏమనాలో.. తిట్టాలో పొగడాలో.. గర్వపడాలో.. బాధపడాలో తెలియని పరిస్థితిలో నేనున్నాను అంటుంది జగతి. మన ఎండీ గారు, మా అబ్బాయి ఇద్దరూ అవకాశం ఇవ్వలేదు. కొన్నిసార్లు ఏటికి ఎదురు ఈదడమే కరెక్ట్. ప్రవాహానికి ఎదురెళ్తూ మొండిగా వెళ్తేనే విజయం సాధిస్తాం అంటుంది జగతి.
ప్రతి ఓదార్పు వెనుక బోలెడన్ని అబద్ధాలు ఉంటాయి కదా మేడమ్ అంటుంది వసుధర. ఇంతలో అక్కడికి వసుధర వస్తుంది. ఏంటి జగతి.. ఇక్కడేం మాట్లాడుతున్నావు. ఎంత కాదన్నా కన్నతల్లివి కదా ప్రపంచానికి అంటుంది దేవయాని. పనులన్నీ అలాగే ఉన్నాయిరా అంటుంది.
మరోవైపు వసుధరను అద్దంలో చూసి తనకు ఏదో నచ్చజెప్పాలని చూస్తాడు రిషి. మరోవైపు వసుధర, గౌతమ్ ఇద్దరూ రిషి పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు. మరోవైపు సాక్షి పేరెంట్స్ లగ్నపత్రిక వేయించుకోవడానికి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.