Saiee Manjrekar : ఈ స్టార్ కిడ్ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతుందా..?
Saiee Manjrekar: బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వచ్చిన హీరోయిన్స్ ఇక్కడ సక్సెస్ అవడం అంత సులభమేమీ కాదు. భాష సమస్యతో మన వాళ్ళకు అంత ఈజీగా ఎక్కరు. అందుకే బాలీవుడ్ నుంచి 10 మంది టాలీవుడ్‌కు హీరోయిన్స్‌గా పరిచయమైతే వారిలో ఒకరో ఇద్దరో నిలబడుతున్నారు. ఇటీవల ఇదే వరుసలో వచ్చిన బాలీవుడ్ స్టార్ నడుటు మహేశ్ మంజ్రేకర్ కుమార్తె సాయీ మంజ్రేకర్ గని సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ సినిమాలో అమ్మడు పర్ఫార్మెన్స్ గురించి ఇప్పటి వరకు మాట్లాడినవారు ఒక్కరూ లేకపోవడం ఆశ్చర్యకర మనే చెప్పాలి.
లుక్స్ పరంగా సాయీ మంజ్రేకర్ బాగానే ఆకట్టుకుంది. కానీ, కథలో ఆమెది అంత కీలక పాత్ర కాకపోవడం సినిమా నిండా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, కన్నడ స్టార్ ఉపేంద్ర, టాలీవుడ్ స్టార్ జగపతి బాబు, నవీన్ చంద్ర, నదియా లాంటి ఉండటం.. స్పెషల్ సాంగ్‌లో తమన్నా నటించడంతో అమ్మడి మీద పెద్దగా ఫోకస్ పోలేదు. దాంతో మెగా ఫ్యామిలీ హీరోతో లాంచ్ అయినా కూడా సాయి మంజ్రేకర్ క్రేజ్ తెచ్చుకోలేకపోయింది. ఇదే సినిమా కాదు మరో సినిమాను తెలుగులో చేసింది సాయీ మంజ్రేకర్. ఆ సినిమానే టాలెంటెడ్ హీరో అడవి శేష్ నటించిన మేజర్.

will saiee-manjrekar gets success by major
Saiee Manjrekar: ఈ బాలీవుడ్ బ్యూటీకి హిట్ దక్కితే మేజర్ సినిమాతోనే దక్కాలి.
ఈ సినిమా కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు గూడాచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా. ఇప్పటికే, ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాతోనైనా సాయీ మంజ్రేకర్ టాలీవుడ్‌లో హిట్ అందుకుంటుందా చూడాలి. అడవి శేష్ సినిమా అంటే కథ కథనం అద్భుతంగా ఉంటాయి. ఇప్పటి వరకు తన నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకాధరణ పొందినవే. కాబట్టి, ఈ బాలీవుడ్ బ్యూటీకి హిట్ దక్కితే మేజర్ సినిమాతోనే దక్కాలి. లేదంటే వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోతుందనడంలో సందేహమే లేదు.